క్రీడాభూమి

బదులు తీర్చుకుంటుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ : సొంత గడ్డపై విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో మాత్రం తేలిపోయంది. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో 251 పరుగులతో మొదటి టెస్టులోనే ఘోర పరాజయం చవిచూసింది. అయతే ఇదే గడ్డపై బుధవారం నుంచి జరిగే రెండో టెస్టులో గెలిచి కంగారూలపై బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు లార్డ్స్‌లోనూ ఆతిథ్య జట్టును ఆడుకుంటామని పైన్ సేన బహిరంగంగానే ప్రకటనలు చేస్తోంది. తమ జట్టు ఆటగాళ్లంతా సూపర్ ఫాంలో ఉన్నారని, రెండో టెస్టును చేజిక్కించుకుంటామని చెబుతోంది.
జొఫ్రా ఆరంగేట్రం..
ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌తో వెలుగులోకి వచ్చిన ఇంగ్లాండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్ రెండో టెస్టు తుది జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. సినీయర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొడ కండరాల నొప్పితో దూరం కావడం, ఆర్చర్‌కి కలిసొచ్చింది. మొన్న జరిగిన ప్రపంచకప్‌లో 11 మ్యాచ్‌లాడిన ఆర్చర్ 4.57 ఎకనామీతో 20 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ తరఫున ఆర్చర్ ఒక్కడే 20 వికెట్లు సాధించడం విశేషం. అయతే లార్ డ్సలో జరిగే రెండో టెస్టు ద్వారా జొఫ్రా టెస్టుల్లో ఆరంగేట్రం చేయనున్నాడు. దీంతో ఇంగ్లాండ్ కూడా ఆర్చర్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది. మొద టి టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించి ఆస్ట్రేలి యా జట్టు విజయం కీలక పాత్ర పోషించిన స్టీవెన్ స్మిత్‌కు ఆర్చ ర్ కళ్లెం వే స్తాడని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. అయతే ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ మాత్రం ఆర్చర్ ఒక్కడిపైనే తామూ భారం వేయదల్చుకోలేదని పేర్కొన్నాడు. జట్టులో ప్రస్తు తం బౌలింగ్ బలంగానే ఉందని, ఆర్చర్ రాకతో మరింత బల పడిందన్నాడు. మరో మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాట్లాడుతూ ఆర్చర్ తప్పకుండా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
స్మిత్‌పైనే భారం..
మొదటి టెస్టులో స్టీవెన్ స్మిత్ మినహా ఆసిస్ జట్టు టాప్, మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ స్మిత్ తర్వాత మాథ్యూ వేడ్ ఒక్కడే సెంచరీ చేశాడు. ఓపెనర్లు కామెరూన్ బెన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖాజాలు రాణిస్తే రెండో టెస్టులో కంగారూలకు తిరుగుండదు. ఇక ట్రావిస్ హెడ్, కెప్టెన్ టిమ్ పైన్ మిడిలార్డర్‌లో రాణించాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్, పీటర్ సిడేల్, నాథన్ లియాన్‌లు ఫర్వాలేదనిపించారు. అయతే మొదటి టెస్టులో 2 వికెట్లు మాత్రమే తీసిన జేమ్స్ ప్యాటిన్సన్‌ను లార్డ్స్‌లో జరిగే రెండో టెస్టుకు బెంచ్‌కే పరిమితం చేశారు. మిచెల్ స్టార్క్, హజెల్‌వుడ్‌లకు స్థానం కల్పించనున్నారు. జట్టులో ఈ ఒక్క మార్పు మాత్రమే చేశారు.
రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: టిమ్ పైన్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్, ఉస్మాన్ ఖాజా, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, పీటర్ సిడేల్, నాథన్ లియాన్, జోష్ హజెల్‌వుడ్.
చిత్రాలు.. నెట్స్‌లో కసరత్తు చేస్తున్న జొఫ్రా ఆర్చర్
*నెట్స్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు