క్రీడాభూమి

తడబడిన న్యూజిలాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలె, ఆగస్టు 14: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. 203 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన కివీస్‌ను సినీయర్ ఆల్‌రౌండర్ రాస్ టేలర్ అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జీత్ రావల్, టామ్ లాథమ్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో టీమ్ లాథమ్ (30) అఖిల ధనుంజయ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0) అదే ఓవర్‌లో చివరి బంతికి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రావల్ (33) వికెట్ కూడా ధనుంజయ బౌలింగ్‌లోనే పడడంతో కివీస్ 71 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో ఉన్న రాస్ టేలర్, హెన్రీ నికోల్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 100 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. అప్పటికే ఆచితూచి ఆడుతున్న టేలర్ కెరీర్ 31వ టెస్టు అర్ధ సెంచరీ సాధించాడు. ప్రమాదకరంగా మారిన ఈ జంటను చివరకు ధనుంజయ విడదీశాడు. హెన్రీ నికోల్స్ (42)ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బీజే వాట్లింగ్ (1)ను కూడా అవుట్ చేసిన అఖిల ధనుంజయ తొలి రోజే 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటికీ మొదటిరోజు ఆట ముగియడంతో రాస్ టేలర్ (86, నాటౌట్), మిచెల్ శాంత్నార్ (8, నాటౌట్) క్రీజులో నిలిచారు. శ్రీలంక బౌలర్లలో అఖిల ధనుంజయ 5 వికెట్లతో రాణించాడు.

చిత్రాలు.. రాస్ టేలర్ (86నాటౌట్)
* అఖిల ధనుంజయ (5/57)