క్రీడాభూమి

లంకను తిప్పేసిన పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలె, ఆగస్టు 15: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు శ్రీలంక 22 పరుగులు వెనుకబడింది. రెండో రోజు గురువా రం ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్లకు 203 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ మరో 46 పరుగులు మాత్రమే చేసి మిగతా వికెట్లను కోల్పోయంది. తొలిరోజు కివీస్ వికెట్లను అఖిల ధనుంజయ పడగొట్టగా, రెండో రోజు సురంగ లక్మల్ 4 వికెట్లతో రాణించాడు. మొద టి ఓవర్ తొలి బంతికే అర్ధ సెంచరీ హీరో రాస్ టేలర్ (86) లక్మల్ బౌలిం గ్‌లో వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా మిచెల్ శాంత్నర్ (13), టిమ్ సౌథీ (14), ట్రెంట్ బౌల్ట్ (18), అజాజ్ పటేల్ (0), విలియమ్ సోమర్‌విల్లే (9, నాటౌట్) తక్కువ స్కోర్లకే పెవలియన్‌కు చేరడంతో న్యూజిలాండ్ 83.2 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో అఖిల ధనుంజయకు 5 వికెట్లు పడగా, సురంగ లక్మల్ 4 వికెట్లను తీశాడు.
అజాజ్ పటేల్‌కు 5 వికెట్లు..
న్యూజిలాండ్‌ను తక్కువ పరుగు లకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్‌లో బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 27 పరుగుల వద్ద ఓపెనర్ లాహీరు తిరుమనె్న (10) అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఆడి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో కెప్టెన్ దిముత్ కరుణరత్నే, సీనియర్ ఆటగాడు కుశల్ మెండిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయతే కరుణ రత్నే (39) అజాజ్ బౌలింగ్‌లోనే ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ చూడ చక్కని షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ చేసిన కుశల్ మెండీస్ (53) అజాజ్ బౌలింగ్‌లో రాస్ టేలర్ చేతికి చిక్కాడు. ఆ తర్వతి ఓవర్‌లోనే కుశల్ పెరీరా (1)ని బౌల్ట్ పెవిలియన్‌కు పంపగా, ధనుంజయ డిసిల్వా (5)ను అజాజ్ రిటర్న్ క్యాచ్ ద్వార అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక జట్టు 155 పరుగులకే 5 వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. మరోవైపు వికెట్లు పడుతున్నా మాథ్యూస్ (50) అర్ధ సెంచరీని సాధించి అవుట్ కాగా, అఖిల ధనుంజయ (0) సోమర్‌విల్లే బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికీ సమయం దగ్గరపడడంతో రెండో రోజూ ఆట ముగిసే సమయా నికి లంక 7 వికెట్లను కోల్పోయ 227 పరుగులు చేసి 22 పరుగులు వెనుకబడింది. నిరోషన్ డిక్వెల్లా (39, నాటౌట్), సురంగ లక్మల్ (28, నాటౌట్) క్రీజులో ఉన్నారు. న్యూజి లాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 5 వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్, విలియమ్ సోమర్‌విల్లే చెరో వికెట్ తీసుకున్నారు.
చిత్రం... అజాజ్ పటేల్
29-6-76-5