క్రీడాభూమి

బాక్టీరియా దెబ్బ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, ఆగస్టు 17: ఒలింపిక్స్‌కు ఓవైపు టోక్యో నిర్వాహణ కమిటీ (ఓసీ) అన్ని విధాలా సిద్ధమవుతుండగా, కొత్తకొత్త సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2020 ఒలింపిక్స్‌కు చేపట్టిన ఏర్పాట్లు అసాధారణ ప్రమాణాలతో అలరిస్తున్నాయని అంతర్జాతీయ క్రీడా ప్రపంచం ఓసీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నది. అయితే, జపాన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే స్విమ్మింగ్ ఈవెంట్‌లోనే సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం కనిపిస్తున్నది. ఒలింపిక్స్ పారాట్రయథ్లాన్ ట్రయల్స్‌లో భాగంగా స్విమ్మింగ్ ఈవెంట్‌లో పోటీలను నిర్వాహకులు రద్దు చేయాల్సి వచ్చింది. నీటిలో బాక్టీరియా ప్రమాదకర స్థాయి లో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. నీటి స్వచ్ఛత, ఉష్ణోగ్రత అంతర్జాతీయ ప్రమాణాలకు దరిదాపుల్లో కూడా లేవని అంతర్జాతీయ ట్రయథ్లాన్ యూనియర్ (ఐటీయూ) మండిపడింది. సుమారు 70 మంది పారాథ్లెట్లు స్విమ్మిం గ్ ఈవెంట్‌లో పోటీకి దిగాల్సి ఉండగా, నీటిని పరీక్షించినప్పుడు అందులో బాక్టీయా ప్రమాదకర స్థాయికి చేరినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే స్పందించిన ఓసీ ఈ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. లోపాలను సరిదిద్దిన తర్వాత పోటీలను కొనసాగించనున్నట్టు తెలిపింది. ఇలావుంటే, ఒలింపిక్స్‌కు సిద్ధం చేస్తున్న వేదికల్లో ఇలాంటి అపశృతులు దొర్లడంపై ఐటీయూసహా వివిధ క్రీడా సమాఖ్యలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించకుండా, టెస్ట్ ఈవెంట్స్‌ను ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్స్‌లో బాక్టీరియా ప్రమాదకర స్థాయికి చేరడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న జపాన్ అధికారులకు ఈ పరిణామాన్ని ఒక హెచ్చరికగా పేర్కోవాలి.