క్రీడాభూమి

ఎందుకీ డ్రామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: టీమిండియా కోచ్‌గా రవి శాస్ర్తీని కొనసాగించాలని ముందుగానే నిశ్చయమైనప్పుడు, దరఖాస్తుల ఆహ్వానం నుంచి ఎంపిక కోసం సమావేశం వరకూ హై డ్రామా కొనసాగించాల్సిన అవసరం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవి శాస్ర్తీకే మళ్లీ అవకాశం ఇవ్వాలని క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. కపిల్ దేవ్ నేతృత్వంలోని కోచ్ ఎంపిక ప్యానెల్ ఇంటర్వ్యూలను నిర్వహించి, చివరికి రవి శాస్ర్తీ పేరును ఖరారు చేయడం, ఇది ఏకీగ్రీవ నిర్ణయమని ప్రకటించడం చర్చకు తెరతీశాయి. సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది విమర్శలు గుప్పిస్తున్నారు. మైక్ హెస్సన్, టామ్ మూడీ చివరి వరకూ పోటీలో ఉన్నారని, అయితే, రవి శాస్ర్తీకి భారత క్రికెట్‌కు సంబంధించిన అన్ని విభాగాలపైనా స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి అతనికే మరోసారి అవకాశం ఇవ్వాలని తీర్మానించామని కపిల్ ప్రకటించిన వెంటనే, ఇదంతా ఒక నాటకమంటూ పలువురు క్రికెట్ అభిమానులు విరుచుకుపడ్డారు. ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకొని రవి శాస్ర్తీ పేరును ఖరారు చేశారో వివరించాలని డిమాండ్ చేశారు. కపిల్ దేవ్, అంశుమాన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి విలేఖరుల సమావేశంలో పాల్గొని, కోచ్ పదవికి రవి శాస్ర్తీ పేరునే ఖరారు చేసినట్టు తెలిన తర్వాత పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చివరికి డ్రామా ముగిసింది. మరోసారి ఐసీసీ టోర్నీల్లో పరాజయాల వార్తలను వినేందుకు సిద్ధం కండి. రవి శాస్ర్తీని కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు దరఖాస్తులు ఎందుకు? ఇంటర్వ్యూలు దేనికి?’ అని ఓ క్రికెట్ అభిమాని ట్వీట్ చేశాడు. మైక్ హెస్సెన్, టామ్ మూడీతోపాటు భారత మాజీ క్రికెటర్లు రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌ను కూడా ఇంటర్వ్యూ చేసి, వారిని అవమానించాల్సిన అవసరం ఏముందని మరో అభిమాని సీఏసీని నిలదీశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక డ్రామాగానూ, కంటితుడుపు చర్యగానూ పలువురు అభివర్ణించారు. కపిల్ నేతృత్వంలోని సీఏసీ ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందని, ప్రజలను, దేశాన్ని మభ్యపెట్టడానికి ఇంటర్వ్యూ డ్రామా ఆడిందని మండిపడ్డారు.
పట్టుబట్టిన కోహ్లీ!
రవి శాస్ర్తీని కోచ్‌గా కొనసాగించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుబట్టినట్టు సమాచారం. సీఏసీ చీఫ్ కపిల్‌కు తన అభిప్రాయాన్ని అతను ముందుగానే వెల్లడించాడని, దీనితో ఇంటర్వ్యూ ప్రక్రియను నామమాత్రంగా నిర్వహించి, రవి శాస్ర్తీ పేరును ప్రకటించారని తెలుస్తోంది. సోషల్ మీడియానేగాక, కొన్ని పత్రికల్లోనూ కోహ్లీ తన పంతాన్ని నెగ్గించుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. 2017లో కోచ్‌గా నియమితుడైన రవి శాస్ర్తీ కాంట్రాక్టు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌తో ముగిసింది. అయితే, కొత్త కోచ్ ఎంపిక జరగలేదన్న కారణంగా, కాంట్రాక్టును తాత్కాలికంగా పొడిగించారు. ప్రస్తుతం అతను వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీమిండియాతో ఉన్నాడు. కాగా, మరో రెండేళ్లపాటు అతని కాంట్రాక్టును పొడిగించారు. దీనితో 2021 వరకూ అతను టీమిండియా కోచ్‌గా కొనసాగుతాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవి శాస్ర్తీ (ఫైల్ ఫొటో)