క్రీడాభూమి

భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, ఆగస్టు 17: ఒలింపిక్స్ మహిళల హాకీ టెస్టు ఈవెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 2-1 తేడాతో ఓడించింది. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్టు గుర్జీత్ కౌర్ రెండు గోల్స్ చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్ల క్రీడాకారిణులు నువ్వా? నేనా? అన్న చందంగా పోటీపడ్డారు. ఆటపై ఆధిపత్యాన్ని సంపాదించేందుకు కృషి చేశారు. ప్రత్యర్థి రక్షణ వలయాన్ని ఛేదించిన గుర్జీత్ 9వ నిమిషంలో తొలి గోల్ చేసి భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలబెట్టింది. అయితే, మరో ఏడు నిమిషాల్లోనే జపాన్‌కు ఈక్వెలైజర్ లభించింది. అకి మిస్తుహషి చక్కటి ఫీల్డ్ గోల్‌తో అలరించింది. స్కోర్లు సమం కావడంతో, ఇరు జట్లు తిరిగి ఆధిపత్య పోరాటానికి తెరతీశాయి. 35వ నిమిషంలో లభించిన పెనాల్టీని గుర్జీత్ గోల్‌గా మలచి, భారత్ ఆధిక్యాన్ని 2-1కి పెంచింది. ఆతర్వాత వ్యూహాత్మకంగా, రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, జపాన్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ని ముగించింది. ఇలావుంటే, ఈ టోర్నమెంట్‌లో గెలిచిన జట్టు 2020 ఒలింపి క్స్‌లో నేరుగా అర్హతను సంపాదించుకుంటుంది. ఆసియా ఖండం నుంచి స్థానం కోసం దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలతో భారత్‌కు గట్టిపోటీ తప్పదని విశే్లషకుల అభిప్రాయం.

చిత్రం...జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతిని తన ఆధీనంలోకి తీసుకుంటున్న భారత హాకీ క్రీడాకారిణి గుర్జిత్ కౌర్