క్రీడాభూమి

పట్టుబిగించిన శ్రీలంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, ఆగస్టు 17: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌పై శ్రీలంక పట్టు బిగించింది. నాలుగో రోజు వెలుతురు సరిగ్గా లేని కారణంగా నిర్ణీత సమయానికంటే ముందుగానే ఆట నిలిపివేసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టం లేకుండా 133 పరుగులు చేసింది. విజయానికి ఈ జట్టు ఇంకా 135 పరుగులు చేయాలి. పది వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక రోజు ఆట మిగిలి ఉండడంతో, శ్రీలంక విజయం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకే ఆలౌటైంది. అందుకు సమాధానంగా శ్రీలంక 267 పరుగులు సాధించి, 18 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించి, 285 పరుగులకు ఆలౌటైంది. బీజే వాల్టింగ్ 77, విలియమ్ సొమెర్విల్లె (40 నాటౌట్) అండగా నిలవడంతో, కివీస్ ఈ స్కోరు చేయగలిగింది. లంక ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.
కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌పై ఆధిక్యాన్ని సంపాదించేందుకు ఆచితూచి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లంక, నాలుగో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 133 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ దిముత్ కరుణరత్నే 168 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ లాహిరు తిరిమానే (132 బంతుల్లో 57 నాటౌట్) కూడా అర్ధ శతకాన్ని పూర్తి చేసి క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరూ ఫామ్‌ను కొనసాగిస్తున్న కారణంగా, చివరి రోజున విజయానికి అవసరమైన మిగతా 135 పరుగులను సాధించడం లంకకు కష్టమేమీ కాదనే చెప్పాలి.

సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 83.2 ఓవర్లలో 249 ఆలౌట్ (జీత్ రావెల్ 33, టామ్ లాథమ్ 30, రాస్ టేలర్ 86, హెన్రీ నికోల్స్ 42, సురం గ లక్మల్ 4/29, ధనంజయ డి సిల్వ 5/80).
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 93.2 ఓవర్లలో 267 ఆలౌట్ (దిముత్ కరుణరత్నే 39, కుశాల్ మేండిస్ 53, ఏంజెలో మాథ్యూస్ 50, నిరోషన్ డిక్వెల్లా 61, సురంగ లక్మల్ 40, అజాజ్ పటేల్ 5/89, విలియమ్ సొమెర్విల్లె 3/89, ట్రెంట్ బౌల్ట్ 2/45).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగులు వెనుకంజ): 106 ఓవర్లలో 285 ఆలౌట్ (టామ్ లాథమ్ 45, బీజే వాల్టిం గ్ 77, విలియమ్ సొమెర్విల్లె 40 నాటౌట్, లసిత్ ఎంబుల్డెనియా 4/99, లాహిరు కుమరా 2/31, ధనంజయ డి సిల్వ 3/25).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (విజయ లక్ష్యం 268): 50 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా 133 (దిముత్ కరుణరత్నే 71 నాటౌట్, లాహిరు తిరిమానే 57 నాటౌట్).
చిత్రం...దిముత్ కరుణరత్నే (71 నాటౌట్)