క్రీడాభూమి

దీపకు ఖేల్ రత్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మాలిక్ శనివారం దేశంలో క్రీడారంగానికి సంబంధించి అత్యున్నత స్థాయి పురస్కారమయిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు నామినేట్ అయ్యారు. దీంతో ఆమె ఆసియన్, కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ బజ్‌రంగ్ పూనియా సరసన చేరారు. ఖేల్ రత్న పురస్కారాల కోసం 12 మంది సభ్యులతో కూడిన ఎంపిక కమిటీ శుక్ర, శనివారాలలో ఇక్కడ సమావేశమయింది. 2016 రియో పారాలింపిక్స్‌లో షాట్‌పుట్ ఎఫ్53 విభాగంలో రజత పతకం సాధించిన 48 ఏళ్ల దీపను రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర పురస్కారానికి సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 65 కిలోల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ రెజ్లర్ పూనియాను జస్టిస్ (రిటైర్డ్) ముకుందకం శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారమే ఖేల్ రత్న పురస్కారానికి ఎంపిక చేసింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన బాక్సర్ ఎంసీ మేరీ కోమ్ శనివారం నాటి సమావేశానికి హాజరు కాలేదు. తన వ్యక్తిగత కోచ్ ఛోటేలాల్ యాదవ్ ద్రోణాచార్య అవార్డుకు పోటీలో ఉండటం వల్ల ఆమె ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే, ఆమె శుక్రవారం నాటి సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం నాటి సమావేశంలోనే బజ్‌రంగ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయురాలు దీప. 17 ఏళ్ల క్రితం స్పైనల్ ట్యూమర్ కారణంగా ఆమె నడవలేని స్థితికి చేరారు. దీప 2012లో అర్జున అవార్డును, 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
ఎంపిక కమిటీ క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ సహా 19 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. వీరిలో ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్స్ తేజీందర్ పాల్ సింగ్ తూర్, మహమ్మద్ ఆనస్, స్వప్న బర్మన్, ఫుట్‌బాల్ ఆటగాడు గుర్‌ప్రీత్ సింగ్ సంధూ, హాకీ ప్లేయర్ చింగ్లెన్‌సానా సింగ్ కంగుజం, షూటర్ అంజుమ్ వౌడ్‌గిల్ ఉన్నారు. జడేజా గత కొనే్నళ్లుగా భారత టెస్టు, వనే్డ జట్లు రెండింటిలోనూ ఆడుతున్నారు. ప్రపంచ మేటి జట్టుగా నిలిచిన టీమిండియాలో అతను కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు. 2017 ప్రపంచ కప్ పోటీలలో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో పూనం ఉన్నారు. గత సంవత్సరం జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌కు చేరిన భారత జట్టులోనూ ఆమె ఉన్నారు.
సెలక్షన్ కమిటీ మాజీ బాడ్మింటన్ స్టార్ విమల్ కుమార్ సహా ముగ్గురి పేర్లను ద్రోణాచార్య అవార్డుకు నామినేట్ చేసింది. అలాగే ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్ విభాగం)కు మరో ముగ్గురి పేర్లను నామినేట్ చేసింది. గౌతం గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ సహా అయిదుగురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు నామినేట్ చేసింది.
వివిధ పురస్కారాలకు నామినేట్ అయిన క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఖేల్ రత్న: బజ్‌రంగ్ పూనియా (రెజ్లింగ్), దీపా మాలిక్ (పారా-అథ్లెటిక్స్).
అర్జున అవార్డు: తాజీందర్ పాల్ సింగ్ తూర్ (అథ్లెటిక్స్), మహమ్మద్ ఆనస్ యహియా (అథ్లెటిక్స్), ఎస్.్భస్కరన్ (బాడీ బిల్డింగ్), సోనియా లాతర్ (బాక్సింగ్), రవీంద్ర జడేజా (క్రికెట్), చింగ్లెన్‌సానా సింగ్ కంగుజం (హాకీ), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్ సింగ్ గిల్ (మోటర్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా స్పోర్ట్స్- బాడ్మింటన్), అంజుమ్ వౌడ్‌గిల్ (షూటింగ్), హర్మీత్ రాజుల్ దేశాయి (టేబుల్ టెన్నిస్), పూజా ధాండా (రెజ్లింగ్), ఫౌయద్ మీర్జా (ఈక్వెస్ట్రియన్), గుర్‌ప్రీత్ సింగ్ సంధూ (్ఫట్‌బాల్), పూనం యాదవ్ (క్రికెట్), స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సుందర్ సింగ్ గుర్జార్ (పారా స్పోర్ట్స్- అథ్లెటిక్స్), భమిడిపాటి సాయి ప్రణీత్ (బాడ్మింటన్), సిమ్రాన్ సింగ్ షెర్గిల్ (పోలో).
ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరి): విమల్ కుమార్ (బాడ్మింటన్), సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మొహీందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్).
ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్ కేటగిరి): మెజ్‌బాన్ పటేల్ (హాకీ), రంబీర్ సింగ్ ఖోకర్ (కబడ్డీ), సంజయ్ భరద్వాజ్ (క్రికెట్).
ధ్యాన్ చంద్ అవార్డు: మాన్యుయెల్ ఫ్రెడ్రిక్స్ (హాకీ), అరుప్ బాసక్ (టేబుల్ టెన్నిస్), మనోజ్ కుమార్ (రెజ్లింగ్), నిట్టెన్ కిర్‌టనె (టెన్నిస్), సీ.లాల్‌రెంసంగా (ఆర్చరీ).
చిత్రం... దీపా మాలిక్