క్రీడాభూమి

ఆక్లాండ్ ఓపెన్‌కు సెరెనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఆగస్టు 20: ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఆక్లాండ్ ఓపెన్‌లో పాల్గొననున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీకి ఆక్లాండ్ ఓపెన్‌ను వామప్ ఈవెంట్‌గా పేర్కొంది. చివరిసారి 2017లో ఆక్లాండ్ టోర్నీలో ఆడిన ఆమె మొదటి రౌండ్‌లో పాలైన్ పార్మెంటియర్‌ను 6-3, 6-4 తేడాతో ఓడించింది. అయితే, రెండో రౌండ్‌లో మాడిసన్ బ్రెంగిల్ చేతిలో 4-6, 7-6, 4-6 తేడాతో ఓటమిపాలైంది. ఆక్లాండ్‌లో ఎదురైన పరాజయంపై సెరెనా తీవ్రంగానే స్పందించింది. అక్కడ గాలి బలంగా వీస్తున్నదని, టెన్నిస్ టోర్నీలకు ఆ వాతావరణం ఏ విధంగానూ పనికిరాదని వ్యాఖ్యానించింది. కాగా, ఆ వెంటనే, 2018 జనవరిలో ఆమె ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకుంది. కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించి, స్ట్ఫె గ్రాఫ్ 22 టైటిళ్ల మైలురాయిని అధిగమించింది. అదే సమయంలో అలెక్సిస్ ఒహానియన్‌తో సహజీవనం చేస్తున్నానని, తాను గర్భవతినని ప్రకటించింది. అనంతరం టెన్నిస్‌కు దూరమైన ఆమె కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించింది. ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, క్రమంగా గాడిలో పడుతున్నట్టు కనిపించింది. అయితే, గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకునే స్థాయి 37 ఏళ్ల సెరెనాకు ఇప్పుడు లేదని విశే్లషకుల అభిప్రాయం. అయితే, ఆక్లాండ్ ఓపెన్‌లో పాల్గొనడం ద్వారా, వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపమెన్‌కు సమాయత్తమవుతానని సెరెనా తెలిపింది. 24వ గ్రాండ్ శ్లామ్‌ను అందుకోవడం ద్వారా మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయడంమపై దృష్టి పెట్టిన సెరెనా ఎంత వరకూ తన లక్ష్యాన్ని చేరుకుంటుందో చూడాలి.