క్రీడాభూమి

మన్దీప్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో : స్ట్రయకర్ మన్దీప్ సింగ్ హ్యాట్రిక్ సాధించడంతో, జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6-3 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో ఫైనల్‌ను ఖాయం చేసుకుంది. ఒలింపిక్ హాకీ టెస్టు ఈవెంట్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొని, 1-2 తేడాతో పరాజయాన్ని చవిచూసిన భారత్ రెండో మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి ఆడింది. జపాన్‌ను పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టేసింది. మ్యాచ్ మూడో నిమిషంలోనే నీలకంఠ శర్మ భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. తొమ్మిదో నిమిషంలో గోల్ చేసిన మన్దీప్ ఆతర్వాత 29, 30 నిమిషాల్లోనూ గోల్స్ సాధించాడు. భారత్ తరఫున మిగతా రెండు గోల్స్‌ను నీలమ్ సంజీప్ జెస్ (7వ నిమిషం), గుర్జాంత్ సింగ్ (41వ నిమిషం) అందించారు. జపాన్ ఆటగాళ్లు కెంటారో ఫకూదా (25వ నిమిషం), కెన్టా టనాకా (36వ నిమిషం), కజుమా మురాతా (52వ నిమిషం) తలా ఒక్కో గోల్ చేశారు. మొత్తం మీద ఈ మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం మొదటి నుంచి చివరి వరకూ కొనసాగింది. మొదటి మ్యాచ్‌లో రక్షణాత్మక విధానానికి ప్రాధాన్యం ఇచ్చిన భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో అందుకు భిన్నంగా దాడులకు ఉపక్రమించారు. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణంలోనే ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా చేసుకొని దూకుడుగా ఆడారు. చివరి వరకూ అదే వ్యూహాన్ని కొనసాగించారు. బుధవారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఢీకొనేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకున్నారు.
చిత్రం...హ్యాట్రిక్ సాధించిన భారత స్ట్రయకర్ మన్దీప్ సింగ్ ఆనందం