క్రీడాభూమి

బల్బీర్ సింగ్‌కు ‘భారత రత్న’ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 22: ‘లెజెండరీ’ హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్ సీనియర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ప్రకటించాల్సిందిగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 95 ఏళ్ల బల్బీర్ దేశ కీర్తి పతకాన్ని అంతర్జాతీయ వేదికలపై ఆవిష్కరించాడని, అలాంటి అసాధారణ వ్యక్తికి భారత రత్న ఇవ్వడం సముచితంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. 1948, 1052 సంవత్సరాల్లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణ పతకాలు సాధించడంలో బల్బీర్ కీలక పాత్ర పోషించాడని గుర్తుచేశారు. 1956 ఒలింపిక్స్‌లో ఆయన భారత హాకీ జట్టుకు నాయకత్వం వహించారని అమరీందర్ సింగ్ తన లేఖలో తెలిపారు. బల్బీర్ సేవలను గుర్తించిన అప్పటి సర్కారు 1957లో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించిందని తెలిపారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని తాను బలంగా కోరుకుంటున్నానని అమరీందర్ సింగ్ ఆ లేఖలో రాశారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన 16 మంది క్రీడాకారులను ఎంపిక చేసిందని, ఆ జాబితాలో బల్బీర్‌కు చోటు దక్కడం విశేషమని పేర్కొన్నారు. 1952 హెల్సిన్కీ ఒలింపిక్స్ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ 6-1 తేడాతో విజయభేరి మోగించి స్వర్ణ పతకం సాధించిందని, మ్యాచ్‌లో బల్బీర్ ఐదు గోల్స్ చేశాడని గుర్తుచేశారు. ఒలింపిక్స్ హాకీ ఫైనల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా బల్బీర్ పేరిట ఉన్న రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉందని, దానిని ఎవరూ బద్దలు చేయలేకపోయారంటే ఆయన ప్రతిభ ఎలాంటిదో ఊహించడం కష్టం కాదని అమరీందర్ సింగ్ అన్నారు. 1975లో ప్రపంచ కప్‌ను సాధించిన భారత జట్టుకు ఆయన మేనేజర్‌గా వ్యవహరించారని తెలిపారు. దేశ హాకీ రంగానికి విశేష సేవలు అందించిన బల్బీర్‌కు భారత రత్న ఇవ్వడం సముచితంగా ఉంటుందని అన్నారు.