క్రీడాభూమి

యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్స్ జొకోవిచ్, ఒసాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 22: ఫ్లషింగ్ మెడోస్‌లో ఈనెల 26 నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు జరగనున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో నొవాక్ జొకోవిచ్, మహిళల విభాగంలో నవోమీ ఒసాకా టాప్ సీడింగ్‌ను దక్కించుకున్నారు. యూఎస్ లాన్ టెన్నిస్ సమాఖ్య ప్రకటించిన డ్రాలో, కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిల్ కోసం పోటీపడుతున్న జొకోవిచ్ టాప్ సీడ్ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్, స్విట్జర్లాండ్ వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ వరుసగా సెకండ్, థర్డ్ సీడ్స్‌గా ఆడతారు. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లోనే వివాదాస్పద ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను ఓడించి, కెరీర్‌లో తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకున్న ఒసాకా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించనున్న ఆమెకు టాప్ సీడింగ్ లభిస్తే, నిరుటి రన్నరప్ సెరెనా విలియమ్స్ ఎనిమిదో సీడ్‌గా పాల్గొంటుంది. ఆష్లే బార్టీ, కరోలినా ప్లిస్కోవాకు వరుసగా రెండు, మూడు సీడింగ్స్ లభించాయి.
సీడింగ్స్‌లో టాప్-10
పురుషుల విభాగం: 1. నొవాక్ జొకోవిచ్ (11,685 పాయింట్లు), 2. రాఫెల్ నాదల్ (7,945), 3. రోజర్ ఫెదరర్ (6,950), 4. డామినిక్ థియేమ్ (4,925), 5. డానిల్ మెద్వెదేవ్ (4,125), 6. అలెగ్జాండర్ జ్వెరెవ్ (4,005), 7. కెయ్ నిషికొరి (4,005), 8. స్ట్ఫోనొస్ సిట్సిపాన్ (3,455), 9. కరేన్ కచనోవ్ (2,890), 10. రాబర్టో బటిస్టా అగుట్ (2,575).
మహిళల విభాగం: 1. నవోమీ ఒసాకా (6,606 పాయింట్లు), 2. ఆష్లే బార్టీ (6,501 పాయింట్లు), 3. కరోలినా ప్లిస్కోవా (6,315), 4. సిమోనా హాలెప్ (4,743), 5. ఎలినా స్విటోలినా (4,492), 6. పెట్రా క్విటోవా (4,386), 7. కికీ బెర్టెన్స్ (4,325), 8. సెరెనా విలియమ్స్ (3,935), 9. అరినా సబలెన్కా (3,955), 10. మాడిసన్ కీస్ (3,267).

చిత్రం...టాప్ సీడింగ్స్ సంపాదించిన నవోమీ ఒసాకా, నొవాక్ జొకోవిచ్