క్రీడాభూమి

నిరసనలా? జాగ్రత్త..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, ఆగస్టు 22: పాన్ అమెరికా గేమ్స్‌లో సాధించిన పతకాలను స్వీకరించే సమయంలో అమెరికా విధానాలకు నిరసన తెలిపిన ఇద్దరు అథ్లెట్లను అమెరికా ఒలింపిక్, పారాలింపిక్ కమిటీ (యూఎస్‌ఓపీసీ) హెచ్చరించింది. అలాంటి సంఘటనలు పునరావృతమైతే శిక్షలు కఠినతరంగా ఉంటాయని, ప్రస్తుతానికి హెచ్చరికతోనే విడిచిపెడుతున్నామని యూఎస్ ఓపీసీ చీఫ్ సారా హిర్ష్‌లాండ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఫెన్సర్ రేస్ ఇంబోడెన్, హ్యామర్ త్రోయర్ గ్వెన్ బెర్రీ తమతమ విభాగాల్లో పతకాలను సాధించారు. వాటిని స్వీకరించే సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు నిరసన వ్యక్తం చేశారు. అమెరికా జాతీయ గీతాలాపన సమయంలో ఇంబోడెన్ మోకాలిపై కూర్చొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. బెర్రీ పిడికిలిని గాల్లోకి ఊపుతూ నిరసన తెలిపాడు. అనంతరం వారు మాట్లాడుతూ అమెరికాలో సామాజిక న్యాయం జరగడం లేదని ఆరోపించారు. అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల పరిస్థితి మరింత దిగజారుతున్నదని మండిపడ్డారు. కాగా, వీరిద్దరి చేష్టలపై యూఎస్‌ఓపీసీ స్పందించింది. నిరసనలంటూ రాద్ధాంతం సృష్టి స్తే సమస్యలు తప్పవని తెలిపింది. మొదటి తప్పుగా పరిగణిస్తూ, ప్రస్తుతానికి హెచ్చరికతో వదిలేస్తున్నట్టు తెలిపింది. అయితే, రాబోయే ఏడాది కాలంలోగా మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే, కఠినంగా శిక్షించక తప్పదని స్పష్టం చేసింది. రాజకీయ అంశాలకు, నిరసనలకు క్రీడా పోటీలు వేదిక కాకూడదని యూఎస్‌ఓపీసీ వ్యాఖ్యానించింది.
చిత్రం...నిరసన వ్యక్తం చేస్తున్న ఫెన్సర్ రేస్ ఇంబోడెన్