క్రీడాభూమి

వెంటాడిన వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: సారా ఓవల్ మైదానంలో, న్యూజిలాండ్‌తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటను వర్షం వెంటాడింది. ఆటను అర్ధారంతంగా నిలిపివేసే సమయానికి శ్రీలంక రెండు వికెట్లకు 85 పరుగులు చేసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, నిర్ణీత సమయానికి ఆట మొదలు కాలేదు. ఆతర్వాత పరిస్థితి మెరుగుపడడంతో అంపైర్లు ఆటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతుండగా, లాహిరు తిరిమానే కేవలం రెండు పరుగులు చేసి, విలియమ్ సామర్విల్లే బౌలింగ్‌లో, కేన్ విలియమ్‌సన్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించిన కుశాల్ మేండిస్ 32 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బీజే వాల్టింగ్ క్యాచ్ పట్టగా, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 36.3 ఓవర్ల వద్ద భారీ వర్షం కరవడంతో ఆట నిలిచిపోయింది. అప్పటికి కరుణరత్నే (49 నాటౌట్), ఏంజెలో మాథ్యూస్ (0 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఫీల్డ్ అంపైర్లు బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్, మిచెల్ గాఫ్ పలు మార్లు పిచ్‌ని పరిశీలించారు. వర్షం కొంత తగ్గినప్పటికీ, ఔట్ ఫీల్డ్ మొత్తం బురదమయం కావడంతో, ఆటను కొనసాగించడం కష్టమని నిర్ణయానికి వచ్చి, మొదటి రోజు ఆట ముగిసినట్టు ప్రకటించారు. కాగా, శుక్రవారం నాటి రెండో రోజు ఆటకు కూడా వర్షం బెడద వెంటాడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 36.3 ఓవర్లలో 2 వికెట్లకు 85 (దిముత్ కరుణరత్నే 49 నాటౌట్, కుశాల్ మేండిస్ 32, విలియమ్ సామర్విల్లే 1/20, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 1/14).