క్రీడాభూమి

ఓ వైపు ఆనందం.. మరో వైపు ఒత్తిడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 24: భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమీత్ నాగల్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సోమవారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న యూఎస్ ఓపెన్‌లో పాల్గొనేందుకు క్వాలిఫయర్ అడ్డంకిని సమర్థంగా అధిగమించిన అతను మెయిన్ డ్రాలో చోటు దక్కించుకున్నాడు. కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్‌లో ఆడుతున్నానన్న ఆనందం ఒకవైపు అతనిని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మొదటి రౌండ్‌లోనే ప్రపంచ మేటి ఆటగాడు రోజర్ ఫెదరర్‌ను ఢీకొనాల్సి రావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. క్వాలిఫయింగ్ ఈవెంట్ చివరి రౌండ్‌లో అతను బ్రెజిల్ ఆటగాడు మెనెజెస్‌ను 5-7, 6-4, 6-3 తేడాతో ఓడించి, యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాడు. గ్రాండ్ శ్లామ్ టోర్నీ సింగిల్స్ ఆడిన ఐదో భారత ఆటగాడిగా 22 ఏళ్ల సుమీత్ చరిత్ర పుటల్లో చోటు సంపాదించుకున్నాడు.
ఇది వరకు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యూకీ భంబ్రీ, సాకేత్ మైనేని, ప్రజ్ఞేష్ గునే్నశ్వరన్ భారత్ తరఫున యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో పోటీపడ్డారు. ఆ జాబితాలో సుమీత్‌కు చోటు లభించింది. అయితే, ‘ఆల్‌టైం గ్రేట్’ టెన్నిస్ స్టార్లలో ఒకడైన ఫెదరర్‌ను ఎదుర్కోవాల్సి రావడం అతనిని ఒత్తిడికి గురి చేస్తున్నదన్నది వాస్తవం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అతను ఫెదరర్‌ను ఓడించి రెండో రౌండ్ చేరలేడు. అయితే, యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రా వరకూ వెళ్లడం అతను సాధించిన విజయం చెప్పుకోవాలి.

చిత్రం... భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమీత్ నాగల్