క్రీడాభూమి

సక్సేనా హాఫ్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, సెప్టెంబర్ 10: జలజ్ సక్సేనా అజేయంగా అర్ధ శతకాన్ని బాదడంతో, దక్షిణాఫ్రికా ‘ఏ’తో మొదటి అనధికార టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత్ ‘ఏ’ మ్యాచ్‌పై పట్టు సంపాదించింది. తొలి ఇన్నింగ్స్‌లో 139 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ ‘ఏ’ ఆతర్వాత దక్షిణాఫ్రికా ‘ఏ’ను, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 125 పరుగులకు కట్టడి చేసింది. భారత్ ‘ఏ’ కంటే దక్షిణాఫ్రికా ‘ఏ’ ఇంకా 14 పరుగులు వెనుకబడి ఉంది. ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి. రెండు వికెట్ల నష్టానికి 129 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ముగించిన భారత్ ‘ఏ’ కొద్ది సేపటికే అంకిత్ బవానే వికెట్ కోల్పోయింది. అతను 6 పరుగులు చేసి, మార్కో జానె్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొదటి రోజు ఆటలోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసిన శుభమ్ గిల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద డేన్ పీడిట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. శివమ్ డూబే 8 పరుగులు చేసి, హెన్రిక్ క్లాసెన్ క్యాచ్ పట్టగా, లున్గీ ఎన్గిడి బౌలింగ్‌లో ఔటయ్యాడు. జలజ్ సక్సేనా క్రీజ్‌లో నిలదొక్కుకోగా, కృష్ణప్ప గౌతం పరుగుల ఖాతాను తెరవకుండానే లూతో సిపామ్లా బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. కాగా, సక్సేనాకు కొంత సేపు చక్కటి సహకారాన్ని అందించిన శ్రీకరణ భరత్ 33 పరుగులు చేసి, లుతో సిపామ్లా బౌలింగ్‌లో జుబైర్ హమ్జాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శార్దూల్ ఠాకూర్ 34 పరుగులు చేసి, లున్గీ ఎన్గిడి బౌలింగ్‌లో ఎల్‌బీకాగా, చివరిలో షాబాజ్ నదీప్ (0), మహమ్మద్ సిరాజ్ (0) వికెట్లను డేన్ పీడిట్ కైవసం చేసుకున్నాడు. సక్సేనా 96 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్ల సాయంతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పీడిట్, ఎన్గిడి చెరి మూడు వికెట్లు పడగొట్టగా, లుతో సిపామ్లా, మార్కో జనె్సన్ చెరొక వికెట్ తమతమ ఖాతాల్లో వేసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో 139 పరుగులు వెనుకంజలో నిలిచిన దక్షిణాఫ్రికా ‘ఏ’ రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నాలుగో బంతికే తొలి వికెట్‌ను పీటర్ మలాన్ రూపంలో కోల్పోయింది. నాలుగు పరుగులు చేసిన అతనిని మహమ్మద్ సిరాజ్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ ఎయిడెన్ మక్రామ్ (4) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు దొరికాడు. ఫస్ట్‌డౌన్ ఆటగాడు జుబెర్ హమ్జా భారత్ ‘ఏ’ బౌలింగ్‌ను కొద్దిసేపు సమర్థంగా ఎదుర్కోగా, ఖయా జొన్డో (10), సేనురాన్ ముథుసామీ (4) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. హమ్జా 81 బంతుల్లో, ఎనిమిది ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి, కృష్ణప్ప గౌతం బౌలింగ్‌లో రికీ భుయ్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. దక్షిణాఫ్రికా ‘ఏ’ 35 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేయగా, అప్పటికి హెన్రిక్ క్లాసెన్ 35, శియాన్ ముల్డర్ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కృష్ణప్ప గౌతంకు తలా ఒక్కో వికెట్ లభించింది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా ‘ఏ’ తొలి ఇన్నింగ్స్: 51.4 ఓవర్లలో 164 ఆలౌట్ (మార్కో జానె్సన్ 45, డేన్ పిడిట్ 33, శార్దూల్ ఠాకూర్ 3/29, కృష్ణప్ప గౌతం 3/64, షాబాజ్ నదీమ్ 2/37, మహమ్మద్ సిరాజ్ 1/20).
భారత్ ‘ఏ’ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 2 వికెట్లకు 129): 87.5 ఓవర్లలో 303 ఆలౌట్ (రుతురాజ్ గైక్వాడ్ 30, శుభమ్ గిల్ 90, రికీ భుయ్ 26, శ్రీకర్ భరత్ 22, జలయ్ సక్సేనా 61 నాటౌట్, శార్దూల్ ఠాకూర్ 34, డేన్ పిడిట్ 3/84, లున్గి ఎన్గిడి 3/50, లుతొ సిపామ్లా 3/46, మార్కో జానె్సన్ 2/46).
దక్షిణాఫ్రికా ‘ఏ’ రెండో ఇన్నింగ్స్: 35 ఓవర్లలో 5 వికెట్లకు 125 (జుబైర్ హమ్జా 44, హెన్రిక్ క్లాసెన్ 35, షాబాజ్ నదీమ్ 2/13, శార్దూల్ ఠాకూర్ 1/26, మహమ్మద్ సిరాజ్ 1/18, కృష్ణప్ప గౌతం 1/28).
చిత్రం...జలజ్ సక్సేనా (61 నాటౌట్)