క్రీడాభూమి

భిన్నాభిప్రాయాలు సహజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 10: ఎక్కడైనా భిన్నాభి ప్రాయాలు సహజమేనని, ఇందులో వింత ఏమీ లేదని భారత క్రికెట్ జట్టు కోచ్ రవి శాస్ర్తీ వ్యా ఖ్యానించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు పెరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలపై ఒక ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ, ఏదైనా విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం చాలా సహజమని అన్నాడు. వీటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని అన్నాడు. చర్చలు జరిగినప్పుడే సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని అన్నాడు. ఈ భిన్నాభిప్రాయాలను వైషమ్యాలుగానో, విభేదాలుగానో చూడరాదని ఆయన మీడియాకు హితవు పలికాడు. ఎంత ఎక్కువగా చర్చ జరుగుతుందో, అంత గొప్ప వ్యూహ రచనలకు అవకాశం ఉంటుందని అన్నారు. ఆటగాళ్లతో తనకు సుమారు ఐదేళ్లుగా అనుబంధం ఉందని, వారు ఎప్పుడు, ఏ విధంగా ప్రవర్తిస్తారో తనకు తెలుసునని అన్నాడు. కోహ్లీ, రోహిత్ మధ్య తాను ఎన్నడూ విభేదాలనుగానీ, పరస్పర కలహాలనుగానీ చూడలేదని అన్నాడు.