క్రీడాభూమి

దక్షిణాఫ్రికా ‘ఏ’ 9/179

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, సెప్టెంబర్ 11: భారత్ ‘ఏ’తో జరుగుతున్న మొదటి అనధికార టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ము గిసే సమయానికి దక్షిణాఫ్రికా ‘ఏ’ 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 5 వికెట్లకు 125 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా వర్షం కారణంగా కొంత సమయాన్ని కోల్పోయింది. 20 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. హెన్రిస్ క్లాసెన్ 48, వియాన్ ముల్డర్ 46 పరుగులు చేశారు. డేన్ పిడిట్ (1), మార్కొ జనె్సన్ (0) తక్కు వ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆట ముగిసే సమయానికి లుతొ సిపామ్లా 5 పరుగులతో, లున్గీ ఎన్గిడి పరుగుల ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలివుండగా దక్షిణాఫ్రికా ‘ఏ’ 40 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో వికెట్ మాత్రం మిగిలి ఉంది. మూడు రోజుల ఆట ముగిసిన నేపథ్యంలో ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.