క్రీడాభూమి

రాహుల్‌కు చోటు డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 11: దక్షిణాఫ్రికాతో వచ్చే నెల జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా ఎంపిక గురువారం జరుగనుంది. ఇటీవలకాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న లోకేష్ రాహుల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. వెస్టిండీస్ పర్యటనలో తుది జట్టులో అవకాశం పొందలేకపోయిన వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మకు దక్షిణాఫ్రికాపై ఆడే అవకాశం లభించవచ్చు. అతనిని ఓపెనర్‌గా దింపుతారని అనుకుంటున్నారు. హనుమ విహారీ, అజింక్య రహానే 5, 6 స్థానాలను పదిలం చేసుకున్న నేపథ్యంలో రోహిత్ ఓపెనర్‌గా రావడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తర్వాత అతను ఇంతవరకు టెస్టు మ్యాచ్ ఆడలేకపోయాడు. మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోసం అతను తీవ్రంగా పోటీ పడుతున్నా డు. మూడవ స్థానానికి చటేశ్వర పు జారాను ఎంపిక చేయడం ఖాయం. కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానం లో బ్యాటింగ్‌కు దిగుతాడు. ఇలావుంటే, బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, గుజరాత్‌కు చెందిన ప్రి యాంక్ పాంచాల్, పంజాబ్ యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ స్లాట్ కోసం పోటీలో ఉన్నారు. వీరి లో ఎవరికి అవకాశం వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మయాంక్ అగర్వాల్ ఇప్పటికే ఓపెనర్‌గా ఉన్నందు న అతనిని తప్పించి, వేరే ఆటగాళ్లను తీసుకుంటారన్నది అనుమానంగానే ఉంది. మయాంక్‌తోపాటు రోహిత్ ఓపెనర్‌గా వస్తే మిడిలార్డర్‌లో పుజా రా, విరాట్ కోహ్లీ, ఆజింక్య రహానే, హనుమ విహారీ తమ తమ స్థానాలను ఇప్పటికే భద్రం చేసుకున్నారు. హార్దిక్ పాండ్యాను ఆల్‌రౌండర్ రూ పంలో జట్టులోకి తీసుకోవచ్చు. వికె ట్ కీపర్‌గా రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహాలో ఒకరికి అవకాశం లభిస్తుందని అంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ స్థానాలు దాదాపుగా ఖాయమయ్యాయని చెప్పవచ్చు. మ హమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్‌లో ఒకరికి అవకాశం రావచ్చు. స్పిన్నర్స్ స్లాట్ కోసం రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మధ్య పోరు తీవ్రంగా ఉంది.