క్రీడాభూమి

పాకిస్తాన్‌లో భద్రతపై శ్రీలంక బోర్డు ఆందోళన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 11: పాకిస్తాన్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై క్రికెట్ శ్రీలంక (సీఎస్‌ఎల్) ఆందోళన పడుతున్నది. అందుకే, భద్రతా ఏర్పాట్లను మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది. మూడు మ్యాచ్‌ల వనే్డ, మరో మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లను ఆడేందుకు లంక జట్టు పాకిస్తాన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, కెప్టెన్ దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగతోపాటు మరో ఎనిమిది మంది ఇప్పటికే ఈ టూర్‌కు వెళ్లబోమని ప్రకటించారు. దీనితో వనే్డ జట్టుకు లాహిరుతిరిమానే, టీ-20 జట్టుకు దసున్ శణకను లంక జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వనే్డలు కరాచీలో వరుసగా ఈనెల 27, 29, అక్టోబర్ 2న జరుతాయి. అదే విధంగా లాహోర్‌లో టీ-20 ఇంటర్నేషనల్ అక్టోబర్ 5, 7, 9 తేదీల్లో ఉంటాయి. 2009 మార్చి 3వ తేదీన లాహోర్‌లో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్ర దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌లో భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. జింబాబ్వేను మినహాయిస్తే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ టెస్టు హోదాగల ఏ జట్టూ పాక్ పర్యటనకు వెళ్లలేదు. సుమారు దశాబ్దకాలంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. పాక్ టూర్‌కు వెళ్లేందుకు లంక సానుకూలంగా స్పందించింది. అయితే, అక్కడ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ పది మంది కీలక ఆటగాళ్లు టూర్‌కు నిరాకరించడంతో, సీఎల్‌సీ ఆలోచనలో పడినట్టు సమాచారం. పాక్‌లో భద్రతను మరోసారి సమీక్షించి, నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఆటగాళ్లను పంపాలని సీఎస్‌సీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. పీసీబీ మాత్రం ఈ టూర్ జరిగి తీరుతుందన్న ధీమాతో ఉంది.