క్రీడాభూమి

భారత్ ‘ఏ’ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, సెప్టెంబర్ 12: దక్షిణాఫ్రికా ‘ఏ’ జరిగిన మొదటి అనధికార టెస్టులో భారత్ ‘ఏ’ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థిని రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ ‘ఏ’ ఆతర్వాత తన లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘ఏ’ 164 పరుగులు చేయగా, భారత్ ‘ఏ’ మొదటి ఇన్నింగ్స్‌లో 303 పరుగులు సాధించి, 139 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఏ’ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి, మరో ఏడు పరుగులు జోడించి, చివరి వికెట్‌ను కోల్పోయింది. కాగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ ‘ఏ’ తన ముందు ఉన్న 48 పరుగుల లక్ష్యాన్ని సులభంగానే ఛేదించింది. మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేయడం ద్వారా, ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా ‘ఏ’ తొలి ఇన్నింగ్స్: 51.4 ఓవర్లలో 164 ఆలౌట్ (మార్కో జానె్సన్ 45, డేన్ పిడిట్ 33, శార్దూల్ ఠాకూర్ 3/29, కృష్ణప్ప గౌతం 3/64, షాబాజ్ నదీమ్ 2/37, మహమ్మద్ సిరాజ్ 1/20).
భారత్ ‘ఏ’ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 2 వికెట్లకు 129): 87.5 ఓవర్లలో 303 ఆలౌట్ (రుతురాజ్ గైక్వాడ్ 30, శుభమ్ గిల్ 90, రికీ భుయ్ 26, శ్రీకర్ భరత్ 22, జలజ్ సక్సేనా 61 నాటౌట్, శార్దూల్ ఠాకూర్ 34, డేన్ పిడిట్ 3/84, లున్గి ఎన్గిడి 3/50, లుతొ సిపామ్లా 3/46, మార్కో జానె్సన్ 2/46).
దక్షిణాఫ్రికా ‘ఏ’ రెండో ఇన్నింగ్స్: 58.4 ఓవర్లలో 186 ఆలౌట్ (జుబైర్ హమ్జా 44, హెన్రిచ్ క్లాసెన్ 48, వియాన్ ముల్డర్ 46, షాబాజ్ నదీమ్ 3/21, శార్దూల్ ఠాకూర్ 2/31 జలజ్ సక్సేనా 2/22).
భారత్ ‘ఏ’ రెండో ఇన్నింగ్స్: 9.4 ఓవర్లలో 3 వికెట్లకు 49 (రికీ భుయ్ 20 నాటౌట్, శివమ్ డూబే 12 నాటౌట్).