క్రీడాభూమి

నిర్ణయాధికారం అతనిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 12: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయాధికారాన్ని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకే అప్పగిస్తే మంచిదని భారత చెస్ మాంత్రికుడు విశ్వనాథన్ ఆనంద్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ సెమీస్ నుంచే నిష్క్రమించిన తర్వాత, ధోనీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. అతను రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే మంచి సమయమన్న వాదన కూడా బలంగా వినిపించింది. అయితే, ధోనీ వంటి ఆటగాడికి ఏది మంచో? ఏది చెడో? చెప్పాల్సిన అవసరం లేదని, అతను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సింది కూడా ఏమీ లేదని గురువారం పీటీఐతో మాట్లాడుతూ ఆనంద్ అన్నాడు. ధోనీకి అభిమానులు ఎంతో మంది ఉన్నారని, అతని పట్ల వారికి ఇంకా ఎంతో నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు. భారత్‌కు 2007లో టీ-20 వరల్డ్ కప్, 2011లో వనే్డ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టైటిళ్లను ధోనీ అందించిన విషయాన్ని ఆనంద్ గుర్తుచేశాడు. కెప్టెన్‌గానూ అతను ఎన్నో అద్భుత విజయాలను దేశానికి అందించాడని తెలిపాడు. టీమిండియాకు ఎంపిక కావడానికి మరోసారి తనను తాను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని ఆనంద్ అన్నాడు.