క్రీడాభూమి

శుభ్‌మన్ ఇన్.. లోకేష్ రాహుల్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ టీమిండియాకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో వచ్చేనెల జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు జాతీయ సెలక్షన్ కమిటీ గురువారం ఎంపిక చేసిన జట్టులో లోకేష్ రాహుల్‌కు చోటు దక్కలేదు. శుభ్‌మన్‌కు సెలక్టర్లు తొలిసారి అవకాశం కల్పించారు. ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న రాహుల్‌పై వేటు తప్పదన్న వాదన బలంగా వినిపించింది. సెలక్టర్లు ఆ వాదనను నిజం చేశారు. రాహుల్‌ను తప్పించడంతో, టెస్టుల్లో ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి రావడంతోపాటు, ఓపెనర్‌గా సేవలు అందించే వీలు కలిగింది. ‘టెస్టు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రాహుల్‌కు మరో అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించాం’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సమావేశం అనంతరం ప్రకటించాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొన్న రాహుల్‌తోపాటు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్‌కు కూడా సెలక్టర్లు ఉద్వాసన పలికారు. దక్షిణాఫ్రికాతో ఈనెల 26న విజయనగరంలో ప్రారంభమయ్యే మూడు రోజుల టూర్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్ టూర్‌లో విండీస్ ‘ఏ’తో జరిగిన అనధికార టెస్టుల్లో 20 ఏళ్ల శుభ్‌మన్ అద్భుతంగా రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. ఈ సిరీస్‌లోనే డబుల్ సెంచరీ చేసిన అతను, భారత ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్‌ను సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. గత నెల విండీస్‌లోనే టీమిండియా పర్యటించినప్పుడు, శుభ్‌మన్‌కు అవకాశం కల్పించకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీనితో, అక్టోబర్ 2న విశాఖపట్నంలో మొదటి టెస్టుతో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్‌గిల్‌కు చోటు కల్పించారు. ఈ సిరీస్‌లో రెండో టెస్టు అక్టోబర్ 10 నుంచి 14 వరకు పుణేలో, చివరిదైన మూడో టెస్టు 19 నుంచి 23 వరకు రాంచీలో జరుగుతాయి. కాగా, కోహ్లీ, రోహిత్ సఖ్యంగా ఉంటారా లేదా అన్నది చూడాలి.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికైన జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), మాయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, హనుమ విహారీ, రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్.
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), మాయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచాల్, ఏఆర్ ఈశ్వరన్, కరుణ్ నాయర్, సిద్దేశ్ లాడ్, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), జలజ్ సక్సేనా, ధర్మేంద్రసింగ్ జడేజా, అవేష్ ఖాన్, ఇషాన్ పొరెల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్.
చిత్రం...టీమిండియాకు ఎంపికైన పంజాబ్ యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్