క్రీడాభూమి

‘గాటోరేడ్’లోకి హిమా దాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: స్పోర్ట్స్ ఎనర్జీ డ్రింక్స్ విభాగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గాటోరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఏస్ స్ప్రింటర్ హిమాదాస్‌కు అవకాశం లభించింది. భారత బాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధు, జావెలియన్ త్రోయర్ నీరజ్ చోప్రా జాబితాలో ఇప్పుడు హిమా దాస్ కూడా చేరింది. అస్సాంకు చెందిన 19 ఏళ్ల ఈమె ఇటీవల కాలంలో పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న విషయం తెలిసిందే. జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆమె మహిళల 4న400, మిక్స్‌డ్ 4 న400 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. వరుస విజయాలు సాధిస్తూ, దేశ క్రీడాభిమానులకు చేరువైంది. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ఆమెకు ఇప్పుడు గాటోరేడ్ కూడా స్వాగతం పలికింది. వివిధ క్రీడల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారికి మాత్రమే గాటొరేడ్ కుటుంబంలో చోటు దక్కుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న టీనేజ్ సంచలనం హిమా దాస్ పీటీఐతో మాట్లాడుతూ గాటోరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా తనకు అప్పగించే బాధ్యతల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ‘గాటోరేట్‌ను ఎవరూ జయించలేరు’ అనే నినాదాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపింది. సాధ్యమైనంత ఎక్కువ కాలం క్రీడా రంగంలో కొనసాగి, భారత్‌కు పతకాలను అందించాలన్నదే తన లక్ష్యంగా పేర్కొంది. తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆమె చెప్పింది.
చిత్రం... గాటోరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఏస్ స్ప్రింటర్ హిమాదాస్‌