క్రీడాభూమి

అలా రావడం బాధాకరం: కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, సెప్టెంబర్ 14: ఆస్ట్రేలియాతో 2016లో జరిగిన టీ20 సూపర్ 10 మ్యాచ్‌ను గుర్తుచేసుకొని ‘మహేంద్ర సింగ్‌తో కలిసి పరుగులు తీయడం ఫిట్‌నెస్ పరీక్షను తలపించింది’ అని మొన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ వైరల్ అయన విషయం తెలిసిందే. అప్పటికే అదేరోజు ధోనీ రిటైర్మెంట్ వార్తలు మీడియాలో హల్‌చల్ చేయడంతో విరాట్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో తన మాటలపై శనివారం కోహ్లీ స్పందించాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో భాగంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరై మాట్లాడాడు. ‘తను కేవలం ఆనాటి జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నానని, అది సాధారణంగా చేసిన పని మాత్రమే తప్ప అది ఒక వార్తగా మారుతుందని అనుకోలేదన్నాడు. నేను చేసిన ట్వీట్ ధోనీకి రిటైర్మెంట్‌కు సంబంధించిన వార్తగా రావడం బాధాకరమని పేర్కొన్నాడు. అంతేకాకుండా ధోనీ రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదని స్పష్టతనిచ్చాడు.
చిత్రం... కెప్టెన్ విరాట్ కోహ్లీ