క్రీడాభూమి

ఏడోసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 14: అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా శనివారం స్థానిక ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ జట్టు బంగ్లాదేశ్ జట్టుపై 5 పరుగుల తేడాతో విజయం సాధించి, ఏడోసారి ఆండ ర్-19 కప్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ అండర్-19 జట్టు 32.4 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (33)తో పాటు కరణ్ లాల్ (37), షష్వత్ రావత్ (19) మాత్రమే రెండంకెల స్కోరు సాధిం చారు. ఓపెనర్ అరుణ్ అజాద్‌తో పాటు, వరుణ్ లవండే, విద్యాదర్ పాటిల్‌లు పరుగులేమీ చేయకుండానే పెవిలి యన్ చేరారు. బంగ్లా బౌలర్లలో మృత్యుంజయ్ చౌదరి, షమీమ్ హుస్సేన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, తంజీ మ్ షకీబ్, అలం చెరో వికెట్ తీసుకు న్నారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 33 ఓవర్లలోనే 101 పరుగులకు బంగ్లా జట్టు కుప్పకూలి, 5 పరుగుల తేడాతో ఘోర పరాజయం ముటగట్టుకుంది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్, వికెట్ కీపర్ అక్బర్ అలీ (23) అత్యధిక స్కోరు కావడం విశేషం. భారత బౌలర్లలో అధర్వా అంకోలేకర్ 5 వికెట్లు తీయగా, ఆకాశ్ సింగ్ 3, విద్యాదర్ పాటిల్, సుషాంత్ మిశ్రాలు చెరో వికెట్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అథర్వకు దక్కగా, సిరీస్ అర్జున్ అజాద్‌కు లభించింది.

చిత్రం... ఆసియా కప్ ట్రోఫీతో భారత్ అండర్-19 జట్టు