క్రీడాభూమి

సౌరభ్‌కు ‘వియత్నాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హో చి మిన్ సిటీ, సెప్టెంబర్ 15: భారత యువ షట్లర్ సౌరభ్ వర్మ ఇక్కడ జరిగిన వియత్నాం ఓపెన్ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో చైనా ఆటగాడు సున్ ఫెయ్ జియాంగ్‌ను 21-12, 17-21, 21-14 తేడాతో ఓడించాడు. ఒక సెట్‌ను కోల్పోయినప్పటికీ, స్థూలంగా చూస్తే ఈ మ్యాచ్‌లో సౌరభ్ ఆధిపత్యం మొదటి నుంచి చివరి వరకూ కొనసాగింది. టైటిల్‌ను సాధించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పతకాల బహూకరణ తర్వాత పీటీఐతో మాట్లాడుతూ అతను వ్యాఖ్యానించాడు. తుది పోరులో చోటు సంపాదించే క్రమంలో జపాన్ మేటి క్రీడాకారులు కొడాయ్ నరొకా, యూ లగారషి, మినొరూ కొగాను ఓడించగలగడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. ఫైనల్లో జియాంగ్ గొప్పగా ఆడాడని, అంతటి సమర్థుడిపై గెలవడం ఒక గొప్ప అనుభూతిని మిగిల్చిందని సౌరభ్ పేర్కొన్నాడు.