క్రీడాభూమి

బిలియర్డ్స్ కింగ్ అద్వానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండాలే (మైన్మార్), సెప్టెంబర్ 15: భారత బిలియర్డ్స్, స్నూకర్స్ సూపర్ స్టార్ పంకజ్ అద్వానీ తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇక్కడ జరిగిన ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకొని, కెరీర్‌లో 22వ పర్యాయం విశ్వవిజేతగా నిలిచాడు. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో 2014లో జరిగిన టోర్నీ నుంచి అతను ప్రతి ఏటా భారత్‌కు ప్రపంచ టైటిల్‌ను అందిస్తునే ఉన్నాడు. ఈ టోర్నీలో మొదటి నుంచి దూకుడును కొనసాగించిన 34 ఏళ్ల అద్వానీకి గత ఐదేళ్ల కాలంలో నాలుగో మేజర్ టైటిల్. మరోసారి విజేతగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని ఫైనల్లో నే థ్వే ఊపై విజయం సాధించిన అద్వానీ వ్యాఖ్యానించాడు. తుది పోరులో, ఆది నుంచే ఆధిపత్యాన్ని కనబరచిన అతను చివరికి ప్రత్యర్థిని 6-2 తేడాతో చిత్తుచేశాడు. బెంగళూరుకు చెందిన అద్వానీ 2003లో అంతర్జాతీయ వేదికలపై తొలి విజయాన్ని సాధించాడు. అప్పటి నుంచి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రపంచ మేటి ఆటగాళ్లను సైతం చిత్తుచేస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు. తాజా విజయం బిలియర్డ్స్‌లో అతని ప్రతిభకు మరో నిదర్శనం. టైటిల్ ఫేవరిట్ ఊను చిత్తుచిత్తుగా ఓడించి, భారత కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేశాడు.