క్రీడాభూమి

ఇంగ్లాండ్ ఎదురుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి, ఐదో టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి, సిరీస్‌ను 2-2గా డ్రా చేసుకుంది. మాథ్యూ వేడ్ అసాధారణ పోరాట పటమ కనబరచి, సాధించిన సెంచరీ వృథా అయింది. ఇంగ్లాండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్ చెరి నాలుగు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ జో రూట్‌కు రెండు వికెట్లు దక్కాయి. 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. 2-1 ఆధిక్యంతో బరిలోకి దిగి, సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకున్న ఆసీస్ ఆశలకు ఇంగ్లాండ్ గండికొట్టింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 294 పరుగులు సాధించింది. అనంతరం ఆస్ట్రేలియాను 225 పరుగులకే కట్టడి చేసి, అత్యంత కీలకమైన 69 పరుగుల అధిక్యతను సంపాదించిన విషయం తెలిసిందే. ఆతర్వాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయి 313 పరుగులు సాధించింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు, ఆదివారం ఆటను కొనసాగించి, 329 పరుగులకు ఆలౌటైంది. జొఫ్రా ఆర్చర్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద పాట్ కమిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ జాక్ లీచ్ తొమ్మిది పరుగులు చేసి, జొస్ హాజెల్‌వుడ్ క్యాచ్ పట్టగా, నాథన్ లియాన్ బౌలింగ్‌లో పెవినియన్ చేరడంతో, ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని, ప్రత్యర్థి ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
బ్రాడ్ తొలి దెబ్బ
నాలుగో రోజు ఆట ఆరంభమైన కొద్ది సేపటికే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగియడంతో, మరో మూడు సెషన్స్‌తోపాటు, చివరి రోజు ఆట కూడా మిగిలి ఉంది. దీనితో ఫలితం తేలడం ముందుగానే ఖాయమైంది. అయితే, చివరి రోజు వరకూ ఆటను సాగదీయకుండా, నాలుగో రోజే ఇంగ్లాండ్ ఫలితాన్ని తేల్చేసింది. కాగా, ప్రత్యర్థి జట్టు తన ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాను పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తొలి దెబ్బతీశాడు. 18 పరుగుల స్కోరువద్ద మార్కస్ హారిస్ వికెట్‌ను ఆసీస్ కోల్పోయింది. అతను 15 బంతులు ఎదుర్కొని, 9 పరుగులు చేసి, బ్రాడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో వికెట్ కూడా బ్రాడ్‌కే దక్కింది. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ బ్యాట్స్‌మన్, ఓపెర్ డేవిడ్ వార్నర్ (11)ను అతను రొరి బర్న్స్ క్యాచ్ పట్టగా ఔట్ చేశాడు. ఈ సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న మార్నస్ లంబుషేన్ కేవలం 14 పరుగులకే వెనుదిరిగాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టడానికి క్రీజ్ నుంచి బయటకు వచ్చిన అతనిని వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో స్టంప్ చేశాడు. 56 పరుగుల స్కోరువద్ద మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్‌ను అనేక సందర్భాల్లో ఆదుకోవడమేగాక, కీలక విజయాలను సాధించిపెట్టిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పోరాటం జట్టు స్కోరు 85 పరుగుల వద్ద ముగిసింది. 53 బంతులు ఎదుర్కొని, 23 పరుగులు చేసిన అతనిని బెన్ స్టోక్స్ క్యాచ్ పట్టగా, బ్రాడ్ పెవిలియన్‌కు పంపాడు. దీనితో ఆసీస్ కష్టాలు మరింతగా పెరిగాయి. మాథ్యూ వేడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (24)ను జొస్ బట్లర్ క్యాచ్ పట్టగా, జో రూట్ ఔట్ చేశాడు. 148 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్‌ను చేజార్చుకుంది. ఈ పరిస్థితుల్లోనూ మాథ్యూ వేడ్ పోరాటాన్ని కొనసాగిస్తూ, అర్ధ శతకం పూర్తి చేయడం విశేషం. అతనితో కలిసి ఆసీస్ స్కోరుబోర్డును ముందుకు దూకించిన టిమ్ పైన్ (21)ను జాక్ లీచ్ ఎల్‌బీగా ఔట్ చేశాడు. ఆరు వికెట్లకు ఆసీస్ స్కోరు 195 పరుగులు. ఒంటరి పోరాటం సాగించిన వేట్ 147 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతని స్కోరులో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇలావుంటే, పాట్ కమిన్స్ 9 పరుగులు చేసి, బ్రాడ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు దొరికిపోయాడు. 244 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కాగా, కెరీర్‌లో వ్యక్తిగత అత్యధిక టెస్టు స్కోరు సాధించిన వేడ్ 166 బంతుల్లో 117 పరుగులు చేసి, జో రూట్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో స్టంప్ చేయగా వెనుదిరిగాడు. 260 పరుగుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్ చేజారింది. 77వ ఓవర్ వేసిన జాక్ లీచ్ చివరి రెండు బంతుల్లో నాథన్ లియామ్ (1), జొస్ హాజెల్‌వుడ్ (0)ను జో రూట్ క్యాచ్ అందుకోగా ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు 77 ఓవర్లలో 263 పరుగుల వద్ద తెరపడింది. 135 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 87.1 ఓవర్లలో 294 ఆలౌట్ (రొరీ బర్న్స్ 47, జో రూట్ 57, జొస్ బట్లర్ 70, మిచెల్ మార్ష్ 5/56, పాట్ కమిన్స్ 3/86. జొస్ హాజెల్‌వుడ్ 2/76).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 68.5 ఓవర్లలో 225 ఆలౌట్ (మార్నస్ లబుషేన్ 48, స్టీవ్ స్మిత్ 80, నాథన్ లియాన్ 25 నాటౌట్, జొఫ్రా ఆర్చర్ 6/62, సామ్ కూరెన్ 3/46).
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 95.3 ఓవర్లలో 329 ఆలౌట్ (జో డెన్లీ 94, బెన్ స్టోక్స్ 67, జొస్ బట్లర్ 47, నాథన్ లియాన్ 4/69, పాట్ కమిన్స్ 2/67, పీటర్ సిడిల్ 2/52, మిచెల్ మార్ష్ 2/40).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 77 ఓవర్లలో 263 ఆలౌట్ (మాథ్యూ వేడ్‌ణ 117, మిచెల్ మార్ష్ 24, స్టీవ్ స్మిత్ 23, టిమ్ పైన్ 21, స్టువర్ట్ బ్రాడ్ 4/62, జాక్ లీచ్ 4/49, జో రూట్ 2/26).
*చిత్రం...మార్కస్ హారిస్‌ను ఔట్ చేసిన ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాత్‌కు సహచరుల అభినందన