క్రీడాభూమి

హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజరుద్దీన్ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ నెల 27న హెచ్‌సీఏ నిర్వహించనున్న ఎన్నికల్లో అజహర్ అధ్యక్ష పద వికి నామినేషన్ పత్రాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్‌కుమార్ కుమార్‌కు బుధవారం అందజేశాడు. గతంలోనూ అజహర్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. హెచ్‌సీఏకు అజహర్‌తో పాటు మరో తొమ్మిది మంది వివిధ పదవులకు నామినేషన్ వేశారు. మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఆర్‌పీ మాన్‌సింగ్ కుమారుడు విక్రమ్ మాన్‌సింగ్ వైస్ ప్రెసిడెంట్ రేసులో నిలవగా, అజ్మల్ అసద్ (కార్యదర్శి), పీ శ్రీనివాస్ (జాయంట్ సెక్రటరీ), జీ శ్రీనివాస్ (కోశాధికారి), పీ అనురాధ (కౌన్సిలర్) నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. అయతే సెప్టెంబర్ 23 తర్వా త నామినేషన్ల ఉపసంహారణ అనంతరం ఎ న్నికల ప్యానెల్‌ను ప్రకటించనున్నట్లు తెలు స్తోంది. నామినేషన్ దాఖలు అనంతరం అజరుద్దీన్ మాట్లాడుతూ హెచ్‌సీఏ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడమే తన ముందున్న లక్ష్య మన్నాడు. హైదరాబాద్ క్రికెట్‌ను ఉన్నత స్థాయలో నిలుపుతానని చెప్పాడు. తనకు విక్రమ్‌మాన్ సింగ్‌తో పాటు మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ సహకారం ఉన్నట్లు పేర్కొన్నాడు.

*చిత్రం...ఎలక్షన్ కమిషనర్‌కు నామినేషన్ పత్రాలను అందజేస్తున్న మహ్మద్ అజరుద్దీన్