క్రీడాభూమి

ప్రియాంక్ పంచల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూరు, సెప్టెంబర్ 20: ప్రియాంక్ పంచల్ అద్భుత సెంచరీకి, కరుణ్ నాయర్ అర్ధ సెంచరీ తోడవడంతో దక్షిణాఫ్రికా ఏతో జరుగుతున్న రెండో అనధికార టెస్టు డ్రాగా ముగిసింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 14 పరుగులతో శుక్రవారం రెండో ఇన్నింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టు ఆచితూచి ఆడింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ సాధించిన ఓపెనర్ ప్రియాంక్ పంచల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయతే జట్టు స్కోరు 94 వద్ద మరో ఓపెనర్ అభిమాన్యూ ఈశ్వరన్ (37) పిడ్ట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరకిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (0) పిడ్ట్ బౌలింగ్‌లోనే ముత్తుస్వామికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓవైపు వికెట్లు పడుతున్న కరుణ్ నాయర్ సాయంతో ప్రియంక్ పంచల్ (109) సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ముత్తుస్వామి బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (1, నాటౌట్) సహకారంతో కరుణ్ నాయర్ (51, నాటౌట్) అర్ధ సెంచరీ సాధించాడు. అప్పటికే సమయం దగ్గరపడుతుండడంతో ఎంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.