క్రీడాభూమి

పంగల్‌కు రజతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్టారిన్‌బర్గ్ (రష్యా), సెప్టెంబర్ 21: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ టోర్నీలో భారత యువ బాక్సర్ అమిత్ పంగల్ రజతాన్ని సంపాదించాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో రజతాన్ని కైవసం చేసుకున్న తొలి భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఫైనల్‌కు చేరి, బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన పంగల్ ఉజ్బెకిస్తాన్ బాక్సర్ షఖోబిదిన్ జోయిరోవ్ చేతిలో 0-5తేడాతో ఓటమి చవిచూశాడు. ద్వితీయ స్థానానే్న సంపాదించినా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో రజతాన్ని సంపాదించిన తొలి భారతీయుడిగా పంగల్ ఘన కీర్తినే దక్కించుకున్నాడు. తన కంటే ఎత్తులోనూ, శారీరక దారుఢ్యంలోనూ మెరుగైన రీతిలోనే ఉన్న ఉజ్బెక్ బాక్సర్‌పై చివరి వరకూ పంగల్ సర్వశక్తులూ ఒడ్డి పోరాడాడు. అయినా అంతిమ ఫలితంలో ఈ యువ కిశోరానికి కాంస్యమే దక్కింది. ఆసియా క్రీడల్లోనూ, ఆసియా చాంపియన్ షిప్స్‌లోనూ అద్భుతమైన ప్రతిభ కనబరిచి బంగారు పతకాలను సొంతం చేసుకున్న ఘనత కలిగిన పంగల్ రజతం సాధించడం కూడా ఓ చారిత్రక విజయంగానే పరిగణిస్తున్నారు. ఎదురుడానికి సంబంధించిన పోరులో ఇటు పంగల్ అటు జోయిరోవ్‌లు మొదటి మూడు నిముషాల్లో పరస్పరం ఎదుర్కోవడంలో తడబడ్డారు. రెండో రౌండ్‌లో పోటీ రసకందాయంలో పడింది. ప్రత్యర్థి లోపాలను విజయావకాశాలుగా మలుచుకోవడానికి పంగల్ శత విధాలా ప్రయత్నించాడు. దానికి తగ్గట్టుగానే ఉజ్బెక్ బాక్సర్ కూడా పోటీనిచ్చాడు. ఇక తుది పోరు అత్యంత ఉద్విగ్నంగా, ఆసక్తికరంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో ఇరువురు బాక్సర్లు తీవ్ర స్థాయిలోనే తలపడ్డారు. పంగాల్ తన శక్తినంతా కూడగట్టుకుని తీవ్రస్థాయిలోనే పోటీనిచ్చినా అంతిమంగా జోయిరోవ్‌దే పైచేయి అయింది. 0-5పాయింట్ల తేడాతో చాంపియన్‌షిప్ టోర్నీలో ఉజ్బెక్ బాక్సర్దే పైచేయి అయింది. 2017 ఆసియా చాంపియన్‌షిప్ పోటీలో కాంస్యం గెలుచుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాటి నుంచి పంగల్‌కు ఎదురే లేదు.

*చిత్రం...అమిత్ పంగల్