క్రీడాభూమి

రేపటి నుంచి త్రీడే మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 24: అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) చింతలవలస స్టేడియం వేదిక కానుంది. ఇప్పటి వరకు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకే పరిమితమైన ఈ స్టేడియంలో అంతర్జాతీయ టెస్ట్ (సన్నాహక) మ్యాచ్‌లను నిర్వహించనున్నట్టు డాక్టర్ పీవీజీరాజు-ఏసీఏ స్పోర్ట్స్ అకాడమీ నార్త్‌జోన్ కార్యదర్శి జీవీ సన్యాసిరాజు తెలిపారు. మంగళవారం ఇక్కడి ఏసీఏ నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు రోజుల మ్యాచ్ జరుగుతుందన్నారు. ఈ మ్యాచ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా పిచ్‌ను సిద్ధం చేసిన ట్లు తెలిపారు. ప్రతి రోజు వివిధ పాఠశాలల్లో చదువుతున్న 200 మంది విద్యార్ధులకు ఒక్కోరోజు మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. వచ్చే నెల 2 నుంచి 6 వరకు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి టె స్ట్ మ్యాచ్‌కు ముందుగా ఈ సన్నాహక త్రీడే మ్యాచ్ నిర్వహిస్తున్నారన్నారు.