క్రీడాభూమి

విజయ్ హజారే ట్రోఫీకి వర్షం అడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర: ప్రతిష్టాత్మక దేశవాళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫికి తొలి రోజే వర్షం అడ్డంకిగా మారింది. 38జట్లతో మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ సిరీస్‌లో తొలి రోజు 12 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, గ్రూప్ బీలోని 6 జట్ల మ్యాచ్‌లు వ ర్షం కారణంగా టాస్ వేయకుండానే రద్దయ్యా య. ఇక నాగాలాండ్- మణిపూర్ మధ్య జర గాల్సిన మ్యాచ్‌కు కూడా మధ్యలో వర్షం రాకపోవడంతో ఫలితం తేలలేదు. మొత్తంగా తొలిరోజు నాలుగు మ్యాచ్‌లు మాత్రమే జర గ్గా, 6 మ్యాచులు టాస్ వేయకుండానే రద్దు కాగా, మరో మ్యాచ్ ఫలితం తేలకుండా పోయంది. అయతే ప్రతి జట్టుకు 2 పాయంట్ల చొప్పున కేటాయస్తారు. ఈ సీజన్‌లో చండీగఢ్ కొత్త జట్టుగా ట్రోఫీలో పాలుపంచుకుంది.
మేఘాలయ విజయం
డెహ్రాడూన్‌లో మంగళవారం జరిగిన మ్యా చ్‌లో సిక్కిం జట్టుపై మేఘాలయ జట్టు 194 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మేఘా లయ జట్టు నిర్ణిత ఓవర్లలో 5 వికెట్లను కోల్పో య 318 పరుగులు చేసింది. ద్వారక రవితేజ (109, నాటౌట్), వికెట్ కీపర్ పునీత్ బిష్త్ (74), అమియంగ్షూ సేన్ (59) రాణిం చారు. సిక్కిం బౌలర్లలో భూషణ్ సుబ్బా 2 వికెట్లు తీయగా, ఇక్బాల్ అబ్దుల్లా, మందూప్ భటి యా చెరో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిక్కిం 124 పరు గులకే కుప్పకూలింది. యాష్‌పాల్ సింగ్ (53) మినహా మిగతా బ్యాట్స్‌మెన్లంతా విఫలమ య్యారు. మేఘాలయ బౌలర్లలో ఆదిత్య సిం ఘానియా 4 వికెట్లు పడగొట్టగా, అమియం గ్షూ సేన్ 2, ఆకాశ్ చౌదరి, సంజయ్ యాదవ్, స్వరాజీత్ దాస్ తలో వికెట్ తీసుకున్నారు.
బెంగాల్‌పై గుజరాత్ విజయం
జైపూర్ వేదికగా గ్రూప్ సీ విభాగంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌పై గుజరాత్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 253 పరుగులు చేసింది. భార్గవ్ మెరై (63) అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బెంగాల్ 251 పరుగులకే కుప్ప కూలింది. ఓపెనర్ శ్రీవాత్స్ గోస్వామి (79) మాత్రమే రాణించడంతో బెంగాల్‌కు ఓటమి తప్పలేదు.
రాజస్థాన్‌పై తమిళనాడు..
జైపూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టుపై తమిళనాడు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణిత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 261 పరు గులు చేసింది. అర్జిత్ గుప్తా (77), రాహుల్ చాహర్ (48) రాణించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన తమిళనాడు జట్టు మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం 4 వికెట్లను కోల్పోయ విజయం సాధించింది. ఓపెనర్ అభినవ్ ముకుంద్ (75), బాబా అపరజిత్ (52), వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (52, నాటౌట్) రాణించారు.
జమ్మూ కాశ్మీర్‌పై త్రిపుర..
జైపూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్ జట్టుపై త్రిపుర 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు గా బ్యాటింగ్‌కు దిగిన జమ్మూ కాశ్మీర్ జట్టు 43.2 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన త్రిపుర 8 వికెట్లను కోల్పోయ విజయం సాధించింది. ఓపెనర్ బిషాల్ ఘోష్ (62), మిలింద్ కుమార్ (77) అర్ధ సెంచరీలతో రాణించారు.
నాగాలాండ్, మణిఫూర్ మ్యాచ్ రద్దు
డెహ్రాడూన్ వేదికగా జరిగిన నాగాలాండ్, మణిఫూర్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన నాగాలాండ్ నిర్ణిత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 205 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన మణిపూర్ 2 వికెట్లు కోల్పోయ 44 పరుగులు చేయగా, మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
*
రద్దయిన మ్యాచ్‌లివే..
జట్లు వేదిక
మేఘాలయ-మణిపూర్ డెహ్రాడూన్
ఢిల్లీ- విదర్భ వడోదర
మహారాష్ట్ర- హిమాచల్ వడోదర
బరోడా- ఒడిశా వడోదర
ముంబై- సౌరాష్ట్ర అలూర్
ఆంధ్రా- చత్తీస్‌గఢ్ అలూర్
హైదరాబాద్-కర్నాటక అలూర్
గుజరాత్- బెంగాల్ జైపూర్
తమిళనాడు- రాజస్థాన్ జైపూర్
జమ్మూ కాశ్మీర్- త్రిపుర జైపూర్
ఫలితం తేలనిది:
నాగాలాండ్- మణిపూర్ డెహ్రాడూన్
*
*చిత్రం...తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన
గుజరాత్ జట్టు బ్యాట్స్‌మన్ అర్జిత్ గుప్తా (77)