క్రీడాభూమి

మేఘాలయపై పాండిచ్చేరి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, సెప్టెంబర్ 25: దేశవాళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మేఘాలయ జట్టు ఓడిపోయంది. బుధవారం పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌ను వర్షం కారణంగా 28 ఓవర్లకు కుదించారు. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ జట్టు 107 పరుగులకే ఆలౌటైంది. ద్వారక్ రవితేజ (21), సంజయ్ యాదవ్ (20)లు టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాండిచ్చేరి బౌలర్లలో సాగర్ త్రివేదికి 4 వికెట్లు దక్కగా, సాగర్ ఉదేశికి 2, వినయ్‌కుమార్, అశిత్ సంగనాకల్, విక్నేశ్వరణ్ మరిముత్తు తలో వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాండిచ్చేరి జట్టు మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే 6 వికెట్లను కోల్పోయ లక్ష్యాన్ని ఛేదించింది. సురేశ్ కుమార్ (36, నాటౌట్), వినయ్ కుమార్ (20, నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించారు. మేఘాలయ బౌలర్లలో అబే నేగి 4 వికెట్లు తీయగా, ఆకాశ్ చౌదరి, స్వరాజీత్ దాస్ తలో వికెట్‌ను పడగొట్టారు.
113 పరుగుల తేడాతో అస్సాం గెలుపు..
డెహ్రాడూన్ వేదికగా జరిగిన మ్యాచ్లో మిజోరాంపై అస్సాం జట్టు 113 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అస్సాం నిర్ణిత ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయ 324 పరగులు చేసింది. ఓపెనర్ స్వరూపం పర్కాయథ (163, నాటౌట్) సెంచరీకి తోడు గోకుల్ శర్మ (57), సిబ్‌శంకర్ రాయ్ (79, నాటౌట్) అర్ధ సెంచరీలు తోడు కావడంతో భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన మిజోరం జట్టు నిర్ణిత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 211 పరగులు మాత్రమే చేసింది.
తన్మయ్ మిశ్రా సెంచరీ..
జైపూర్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో త్రిపుర జట్టు బ్యాట్స్‌మన్ తన్మయ్ మిశ్రా సెంచరీ చేయడంతో మధ్యప్రదేశ్ జట్టుపై 104 పరుగుల తేడాతో త్రిపురు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన త్రిపుర జట్టు నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయ 268 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన మధ్య ప్రదేశ్ జట్టు 26 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 86 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆ టకు వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయాస్ ప్రత్నామ్నాయమైన వి. జయదేవన్ డక్‌వర్త్ ప్రకారం త్రిపుర జట్టును 104 పరుగుల తేడాతో గెలుపొందినట్లు అంపైర్లు ప్రకటించారు.
బిహార్‌పై రైల్వేస్ విజయం..
విజయ్ హాజరే ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బిహార్‌పై రైల్వేస్ జట్టు 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 289 పరుగులు చేసింది. కెప్టెన్ అరిందమ్ ఘోష్ (96), విక్రాంత్ రాజ్‌పుత్ (70) అర్ధ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బిహార్ 43 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 155 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం అంతరాయం కలిగించడంతో వి. జయదేవన్ డక్‌వర్త్ ప్రకారం రైల్వేస్ జట్టు 84 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తమిళనాడు భారీ విజయం..
జైపూర్ వేదికగా బుధవారం సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 212 పరగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు జట్టులో కెప్టెన్, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (95), హరి నిషాంత్ (73) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం లక్ష్య ఛేదిన దిగిన సర్వీసెస్ జట్టు 82 పరుగులకే కుప్పకూలింది. తమిళనాడు బౌలర లలో కృష్ణమూర్తి విఘ్నేష్ 5 వికెట్లు తీసుకోగా. మహమ్మద్ 3, నటరాజన్, రవి శ్రీనివాసన్ సాయకిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.
మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు..
మంగళవారం నుంచి ప్రారంభమైన విజయ్ హజారే ట్రోఫీకి వరుణుడు పదేపదే అంతరాయం కలిగిస్తున్నాడు. తొలిరోజు వర్షం కారణంగా 6 మ్యాచ్‌లు రద్దుకాగా, రెండో రోజైనా బుధవారం మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయ. ఢిల్లీ-హర్యానా, బరోడా-ఉత్తరప్రదేశ్, పంజాబ్-హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్‌లను వర్షం కారణంగా అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
*చిత్రాలు.. .తమిళనాడు కెప్టెన్ దినేష్ కార్తీక్ (95)
*సర్వీసెస్ జట్టుపై గెలిచిన ఆనందంలో తమిళనాడు ఆటగాళ్లు