క్రీడాభూమి

రోహిత్ 5, రాహుల్ 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ఇంటర్నేషనల్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి టాప్-10 ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు లోకేష్ రాహుల్ మాత్రమే ఉన్నారు. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఫర్వాలేదనిపించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాడు.
659 పాయింట్ల తో 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 639 పాయంట్లతో 13వ స్థానంలో నిలిచాడు. టీమిండి యా నుంచి రోహిత్ శర్మ 664 పాయింట్లతో ఇంగ్లాండ్ ఆటగా డు అలెక్స్ హేల్స్‌తో సంయుక్తంగా 8వ స్థానంలో కొనసాగు తున్నాడు. 896 రేటింగ్ పాయంట్లతో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ టాప్‌లో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ 815 పాయంట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మున్రో (796), ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ (782), అఫ్గానిస్తాన్‌కు చెందిన హజ్రతుల్లా (727) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక ఆస్ట్రేలియాకే చెందిన డీర్సీ షార్ట్ (715), ఫఖర్ జమాన్ (681), లోకేష్ రాహుల్ (662) వరుసగా ఆరు, ఏడు, 10 స్థానాల్లో కొనసాగుతున్నారు.
నాలుగో స్థానంలో భారత్..
టీ20 ర్యాకింగ్స్‌లో జట్ల పరంగా చూస్తే కోహ్లీ సేన 261 రేటింగ్‌తో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 283 రేటింగ్‌తో పాకిస్తాన్ టాప్‌లో కొనసాగుతుండగా, ఇంగ్లాండ్ (266), దక్షిణాఫ్రికా (262), ఆస్ట్రేలియా (261) రేటింగ్స్‌తో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ (252), అఫ్గానిస్తాన్ (235), శ్రీలంక (229), వెస్టిండీస్ (224), బంగ్లాదేశ్ (223) ఉన్నాయి.

*చిత్రం... రోహిత్, రాహుల్