క్రీడాభూమి

సుజుకీ చారిత్రక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో జపాన్ అథ్లెట్ యుసుకే సుజుకీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల 50 కిలో మీటర్ల నడకలో స్వర్ణ పతకం సాధించి, జపాన్ తరఫున ఈ విభాగంలో టైటిల్ గెలిచిన తొలి అథ్లెట్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. ఉష్ణ తాపం తీవ్రంగా ఉన్నప్పటికీ అతను పట్టుదలతో ముందుకు దూసుకెళ్లాడు. లక్ష్యాన్ని 4 గంటల, 4 నిమిషాల, 20 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అయితే, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఒక పతకాన్ని సాధించిన ఎక్కువ వయసుగల అథ్లెట్‌గా పోర్చుగల్ వీరుడు జవో వియెరా రికార్డు నెలకొల్పాడు. సుజుకీకి చివరి వరకూ గట్టిపోటీనిచ్చిన 43 ఏళ్ల వియెరా రజత పతకంతో సంతృప్తి చెందాడు. పోర్చుగల్‌కు చెందిన వియెరా 50 మీటర్ల నడకను 4 గంటల, నాలుగు నిమిషాల, 59 సెకన్లలో పూర్తి చేశాడు. కెనడాకు చెందిన ఇవాన్ డన్ఫీ 4 గంటల, ఐదు నిమిషాల, రెండు సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని, కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
మహిళల 50 మీటర్ల నడకలో టైటిల్ చైనా అథ్లెట్ లియాంగ్ రుయ్‌కు దక్కింది. ఆమె 4 గంటల, 23.26 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి, తన దేశానికే చెందిన లి మావోకువాను రెండో స్థానానికి నెట్టేసింది. మావొకువా 4 గంటల, 26.40 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుంది. ఇటలీకి చెందిన ఎలెనొరా గ్లోర్గీ 4 గంటల, 29.13 నిమిషాలతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
*చిత్రం...యుసుకే సుజుకీ