క్రీడాభూమి

రిషభ్ స్థానంలో సాహా: కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, (స్పోర్ట్స్), అక్టోబర్ 1: టెస్ట్ మ్యాచ్‌లకు రిషభ్‌పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాని జట్టులోకి తీసుకుంటున్నట్టు భారత్ జట్టు కెప్టెన్ విరాట్‌కోహ్లీ ప్రకటించాడు. మంగళవారం నెట్ ప్రాక్టీస్ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ బెంగాల్‌కు చెందిన 34 ఏళ్ళ వృద్ధిమాన్‌తో సాహా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరని కొనియాడారు. సాహా గాయాల కారణంగా గత కాలంగా జట్టుకు దూరమయ్యాడని అన్నాడు. వెస్టిండీస్‌తో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఆడాడని, ప్రస్తుతం సాహా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని చెప్పాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌తో సాహా తిరిగి జట్టులో కొనసాగుతాడన్నాడు. అత్యవసర పరిస్థితుల్లో బ్యాటింగ్‌లో రాణించి జట్టును సాహా ఎన్నోమార్లు ఆదుకున్నాడని వివరించారు. తన దృష్టిలో సాహా ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపరని ప్రశంసించాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జట్టుకు ప్రాతినిథ్యం వహించాడని, ఆ తరువాత భుజానికి, చేతి బొటనవేలికి తగిలిన గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడన్నాడు. ఆ తరువాత వచ్చిన రిషభ్‌పంత్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలతో ఆకట్టుకున్నాడని, అయితే ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో నిర్లక్ష్య బ్యాటింగ్‌తో తక్కువ స్కోర్లకే వెనుదిరగడం, షాట్ ఎంపికలో తడబాటుతో జట్టు మేనేజ్‌మెంట్ అతని స్థానంలో సాహాకు చోటు కల్పించాలని నిర్ణయం తీసుకుందని అన్నాడు. సాహా 32 టెస్ట్ మ్యాచ్‌ల్లో 30.63 స్ట్రైక్ రేటుతో 1164 పరుగులు చేసాడన్నాడు. పంత్‌కు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ తన బ్యాటింగ్‌శైలిలో మార్పు రాకపోవడంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. టెస్ట్ మ్యాచ్‌లకు సాహా అతికినట్లుగా సరిపోతాడని, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు రవిచంద్రన్, రవీంద్ర జడేజాకు తోడు హనుమవిహారీ స్పిన్ విభాగంలో జట్టుకు సేవలందిస్తారని చెప్పాడు. వీరు ముగ్గురూ బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా తమ సత్తా చాటలగలరన్నాడు.

*చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ