క్రీడాభూమి

సీఏసీ నుంచి తప్పుకున్న కపిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ క్రికెట్ సలహా మండలి (సీఏసీ) నుంచి కపిల్ దేవ్ తప్పుకున్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ సలహా మండలి నుంచి శాంత రంగస్వామి ఇప్పటికే రాజీనా మా చేసిన విషయం తెలిసిందే. బుధ వారం కపిల్‌దేవ్ సీఏసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయతే కపిల్ త న రాజీనామాకు గల కారణాన్ని మా త్రం వెల్లడించలేదు. ఇదే విషయమై సుప్రీం కోర్టు నియమించిన అడ్మినిస్ట్రే టర్స్ కమిటీ (సీఓఏ)కి కపిల్ దేవ్ ఈ మెయల్ ద్వారా తన రాజీనామాను ప్రకటించినట్లు తెలుస్తోంది. గత జూ లైలో బీసీసీఐ కపిల్‌దేవ్, శాంత రంగ స్వామి, అన్షుమాన్ గైక్వాడ్‌లతో కూడి న క్రికెట్ సలహా మండలి ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవలే టీమిండి యా హెడ్ కోచ్ రవిశాస్ర్తిని ఎంపిక చేసింది. అంతకుముందు భారత మహిళల జట్టు కోచ్‌ను కూడా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం
సభ్యుడి ఫిర్యాదు..
మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడొకరు కపిల్‌దేవ్ కామెంటేటర్ గా, ప్లడ్‌లైట్ల సంస్థ అధినేతగా, భారత క్రికె టర్ల సంఘం సభ్యుడిగా ఉన్నారు. శాంత రంగస్వామి ఐసీఏ సభ్యురా లు, అన్షుమాన్ గైక్వాడ్‌కు సొంత అకా డమీతో పాటు బీసీసీఐ అఫిలియేషన్ కమిటీ సభ్యుడు కూడా. వీరంతా కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని సీఏసీపై ఫిర్యాదు చేశాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సీఓఏ అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని సీఏసీకి నోటీసులు జారీ చేసింది. అయతే ఇప్పటికే ఇదే విష యమై శాంత రంగస్వామి సీఏసీ నుం చి తప్పుకోగా, తాజాగా కపిల్‌దేవ్ కూడా తప్పుకోవడం చర్చనీయాంశ మైంది. గతంలోనూ మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్‌లకు కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాల విష యంలో నోటీసులు అందుకున్నారు.
*చిత్రం... కపిల్ దేవ్