క్రీడాభూమి

కోరిక తీరింది: రోహిత్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 2: గత రెండేళ్ళుగా టెస్ట్ మ్యాచ్ ఓపెనర్‌గా వెళ్ళాలని ఎదురు చూస్తున్నానని, ఇన్నాళ్ళకు తన కోరిక నెరవేరిందని రోహిత్ శర్మ అన్నాడు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ బుధవారం నుంచి ప్రారంభమైన సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు వర్షం కారణంగా నిలిచిపోయిన అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడుతూ బ్యాటింగ్‌కు దిగేటప్పుడు తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, మానసికంగా సిద్ధపడి బ్యాటింగ్ ఎలా చేయాలన్న వ్యూహంతోనే దిగానన్నాడు. అనుకున్న విధంగానే నిలకడగా ఆడుతూ బంతి మెరుపు తగ్గిన తరువాత భారీ షాట్లకు ప్రయత్నించానన్నాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించడం మంచి అవకాశమని, దీనిని తాను సద్వినియోగం చేసుకున్నానని చెప్పాడు. తనను ఓపెనర్‌గా పంపాలని నిర్ణయం తీసుకున్న జట్టు మేనేజ్‌మెంట్‌కు కృతఙతలు తెలిపాడు. తెల్ల బంతైనా, ఎర్ర బంతైనా కొత్త బాల్‌ను ఎదుర్కొనేటప్పుడు ఓపికగా బేసిక్స్‌కు కట్టుబడి బ్యాటింగ్ చేయాలన్నాడు. పిచ్‌పై బంతి టర్న్ కాకపోవడంతో స్పిన్నర్లను అటాక్ చేశానే తప్ప ముందుగా ఎలాంటి ప్లాన్ చేయలేదన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అనుభవం బ్యాటింగ్ ప్లాన్ ఎలా చేసుకోవాలో నేర్పిందన్నాడు. బ్యాటింగ్ రొటేట్ చేస్తూ బౌలర్లకు రిథమ్ అందకుండా చేయడం ముఖ్యమని చెప్పాడు. ఓపెనర్‌గా దిగడం తన ఆటకు సరిపోతుందని, సింపుల్ ప్లాన్‌తో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగవచ్చన్నాడు. అదే మిడిలార్డర్‌లో దిగితే స్కోరును బట్టి, అప్పటికే పడిన వికెట్లను బట్టి సందర్భోచితంగా బ్యాటింగ్ చేయల్సి ఉంటుందని అబిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి బంతి రివర్స్ స్వింగ్ అవ్వడం, ఫీల్డింగ్‌లో అనేక మార్పులు జరుగుతాయి కాబట్టి, మిడిల్డార్ కంటే ఓపెనింగ్‌లో దిగడమే తనకు ఇష్టమని విలేఖరులు అడిగిన దానికి బదులిచ్చాడు.

*చిత్రం... రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్