క్రీడాభూమి

గేమ్ ప్లాన్ వర్కవుటైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్) : వికెట్లు పడగొట్టి మ్యాచ్ గెలవాలంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉండాలని, అందుకోసమే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశామని భారత జట్టు బ్యాట్స్‌మన్, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేసిన చటేశ్వర్ పుజారా అన్నాడు. మ్యాచ్ నాలుగో రోజు శనివారం ఆట ముగిసిన అనంతరం పుజారా విలేఖరులతో మాట్లాడుతూ కెప్టెన్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం మంచి వ్యూహంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. స్లోపిచ్ కావడం వల్ల రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో బ్యాటింగ్ చేయడం కొంత కష్టమైనప్పటికీ ఒకసారి కుదురుకున్నాక పరుగులు చేయడం సులభమైందని అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో గేమ్ ప్లాన్ ప్రకారం ఆడి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచామన్నాడు. రోహిత్ శర్మ తన బ్యాటింగ్ శైలికి తగ్గట్టు ఆడుతుండటంతో ప్రారంభంలో నిలకడగా ఆడానని, టీ బ్రేక్‌కు 140 పరుగులు తక్కువగా ఉండటంతో బ్యాటింగ్ వేగం పెంచానని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో తాను ఆడిన విధానం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. పిచ్‌పై పగుళ్లు పెరగడంతో పేసర్లకు కూడా అనుకూలించే అంశమన్నాడు. బౌన్స్ అయ్యే ప్రతి బంతి వైవిధ్యంగా వస్తోందని, స్పిన్నర్లు ఇంటువంటి పిచ్‌పై బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తారన్నాడు. దక్షిణాఫ్రికాకు డీసెంట్ స్పిన్ ఎటాకింగ్ బౌలర్లు ఉన్నారని, వైవిధ్యమైన బౌలింగ్ కాంబినేషన్ ఉన్న జట్టుగా ప్రశంసించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు రబడ, ఫిలాండర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తనకు ఇష్టమని, అటువంటి బౌలింగ్‌ను ఛాలెంజ్‌గా తీసుకుంటానని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌కు సహకరించాలని డిఫెన్స్ ఆడి ఔటయ్యానని, రెండో ఇన్నింగ్స్‌లో ఆ పరిస్థితి లేకపోవడంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ఆడామన్నాడు. రోహిత్ శర్మ ఎర్ర బంతి కంటే తెల్లబంతిని ఎదుర్కోవడం ఎక్కువ ఇష్టపడతాడన్నాడు.
*చిత్రం...టీమిండియా బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా