క్రీడాభూమి

మాజీలకు పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత క్రికెట్ సంఘం (ఐసీఏ)కు జరుగనున్న ఎన్నికల జోరు ఊపందుకుంది. ఈనెల 11న జరిగే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు పోటీదారులంతా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఇటీవల రిటైరైన ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్లకు కూడా పెన్షన్, వైద్యం వంటి సదుపాయాలతోపాటు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ఎక్స్‌గ్రేషియాను కూడా ఇప్పిస్తానని మాజీ టెస్ట్ క్రికెటర్ కీర్తి ఆజాద్ హామీ ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో భారత మాజీ ఆటగాళ్లు అన్షుమాన్ గైక్వాడ్, దొడ్డ గణేష్ ప్యానల్స్‌తో ఆజాద్ ప్యానల్ తీవ్రంగా పోటీపడుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సీఓఏ) పర్యవేక్షణలో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కి ఐసీఏ నుంచి ప్రాతినిధ్యం లభిస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణల అనంతరం బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం.
ఇందులో గెలిచేందుకు తీవ్రంగా పోటీ పడుతున్న ఆజాద్ ఆదివారం విలేఖరుల సమావేశంలో 13 హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశాడు. మాజీ క్రికెటర్లకు తగిన గుర్తింపు లభించడంతోపాటు వారిని అన్నివిధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చాడు. తమ ప్యానల్‌ను గెలిపించాల్సిందిగా సభ్యులకు విజ్ఞప్తి చేశాడు.