క్రీడాభూమి

పొట్టి క్రికెట్ రెండో స్థానంలో భారత మహిళా జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 7: వన్‌డే మ్యాచుల్లో ఐసీఐసీ మహిళల క్రికెట్ జట్ల తాజా ర్యాంకింగ్స్ సోమవారం నాడిక్కడ విడుదలయ్యాయి. ఇందులో భారత మహిళ జట్టు రెండో స్థానంలో కొనసాగడంతోబాటు మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు కంటే పాయింట్ల లీడ్‌ను మెరుగుపరుచుకుంది. మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు 125 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, 123 పాయింట్లతో ఇంగ్లాండ్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. అలాగే టీ 20 అంతర్జాతీయ ర్యాకింగ్స్‌లో భారత జట్టు 5 స్థానంలో ఉంది. ఈ విషయంలో ఆస్ట్రేలియా జట్టు స్థిరమైన ఆటతీరును ప్రదర్శిస్తూ అటు వన్‌డే, ఇటు టీ 20 మ్యాచ్‌ల్లో అగ్రగామిగా వెలుగొందుతోందని ఐసీఐసీ నివేదిక పేర్కొంది. కాగా వన్‌డేల్లో వెస్టిండీస్ జట్టు ఐదు ర్యాంకింగ్ పాయింట్లను తాజాగా కోల్పోయింది. పాకిస్తాన్ కంటే ఒక స్థానం ఆధిక్యతతో 7వ స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది టీ 20 ప్రపంచకప్ పోటీల ఫైనల్‌లో వెస్టిండీస్‌పై నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ కంటే 10 నుంచి 14 ర్యాంకింగ్ పాయింట్లు మెరుగుపరుచుకుంది. కాగా థాయ్‌ల్యాండ్ జట్టు సైతం టాప్‌టెన్‌లోకి రావడం విశేషం. ఆ జట్టు పదో స్థానంలో ఉన్న ఇర్లాండ్ కంటే ఒక ఒక స్థానం ఎగబాకి 9వ స్థానానికి చేరింది. ఈయేడాది అద్భుత ఆటతీరుతో 17 మ్యాచ్‌ల్లో వరుస విజయాలను నమోదు చేసింది. విజయాల రేటులో ఆస్ట్రేలియా (16 మ్యాచ్‌లు) కంటే మెరుగైన రికార్డును అందుకుంది. మొత్తం 25 మ్యాచ్‌లు ఆడిన థాయ్‌ల్యాండ్ 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన డెన్మార్క్ 40వ ర్యాంకును, మెక్సికో 41వ ర్యాంకును అందుకున్నాయి. కాగా ఐర్లాండ్, సింగపూర్ చెరి ఏడు పాయింట్ల వంతున నష్టపోయాయి.