క్రీడాభూమి

లంక వైట్‌వాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్స్, అక్టోబర్ 9: శ్రీలంకతో బ్రిస్బేన్స్ వేదికగా బుధవారం జరిగిన చివరి వనే్డలో ఆస్ట్రేలియా మహిళా జట్టు విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో అటు టీ20, ఇటు వనే్డల్లో లంక వైట్‌వాష్‌కు గురైంది. అం తకుముందు టాస్ గెలిచిన శ్రీలంక ముందు గా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ చమరి ఆట పట్టు (103) సెంచరీ మినహా మరెవరూ రాణించకపోవడంతో శ్రీలంక నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయ 195 పరుగులు చేసింది. జట్టులో హర్షిత మాధవి (24), అమ కంచనా (17), ఒషాడి రణసింగే (17), అచిని కుల సూరియా (12) మినహా మిగతా వారంతా సిం గిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మెగన్ స్కచ్, జార్జియా వారెహమ్ రెండేసి వికెట్లు తీసుకోగా. పెర్రీ, నికోలా క్యారీ, దిలీస్సా కిమ్మిన్స్ తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 26.5 ఓవర్లలోనే 1 వికెట్ నష్టపోయ విజయం సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్, వికెట్ కీపర్ ఎలీస్సా హేలీ 76 బంతుల్లోనే (112, నాటౌట్) సెంచరీ సాధించగా, మరో ఓపెనర్ రచైల్ హేన్స్ (63) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.