క్రీడాభూమి

అదరగొట్టారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, అక్టోబర్ 10: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లు అదర గొడుతున్నారు. గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 25 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (14) వికెట్‌ను కోల్పోయనా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. మొదటి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే అవుటైన మయాంక్, మళ్లీ అలాంటి తప్పును పునరావృతం చేయకుండా దక్షిణాఫ్రికా పేస్, స్పిన్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. మరోవైపు పుజారా సైతం జట్టు స్కోరును పెంచే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. అప్పటివరకు నిలకడగా ఆడుతున్న జంటను రబద విడదీశాడు. ఇన్నింగ్స్ 51వ ఓవర్ వేసిన రబద చివరి బంతికి చటేశ్వర్ పుజారా (58)ను పెవిలియన్‌కు పంపాడు. వీరిద్దరూ కలిసి 138 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అప్పటికే సెంచరీకి చేరువైన మయాంక్ స్ట్రైక్ ఇస్తూ సింగిల్స్‌పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్ (108) తన కెరీర్‌తో పాటు సిరీస్‌లో రెండో సెంచరీని నమోదు చేశాడు. అయతే ఆ తర్వాత కొద్దిసేపటికే రబద వేసిన అద్భుత బంతికి డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 198 పరుగులకే భారత్ మూడు కీలక వికెట్లను కోల్పోయంది. మయాంక్ అవుటైన తర్వాత వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో కలిసి కోహ్లీ రెచ్చిపోయాడు. వరుస బౌండరీలతో సఫారీ బౌలర్లను పరుగులు పెట్టించాడు. ఫిలాండర్ వేసిన 81వ ఓవర్‌లో రెండు బౌండరీలను సాధించిన కోహ్లీ (63, బ్యాటింగ్) సిరీస్‌లో మొదటి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఓవరాల్‌గా కోహ్లీకిది 23వ అర్ధ సెంచరీ కావడం విశేషం. మరోవైపు అజింక్యా రహానే (18, బ్యాటింగ్) నెమ్మదిగా ఆడడంతో మొదటిరోజు భారత్ 85.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయ 273 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబద మాత్రమే 3 వికెట్లు తీసుకున్నాడు.
విరాట్‌కు కెప్టెన్‌గా 50వ టెస్టు..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత దక్కించుకు న్నాడు. భారత్ తరఫున 50 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన రెండో క్రికెటర్ గా నిలిచాడు. కోహ్లీ కంటే ముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సిం గ్ ధోనీ 2008-2014 వరకు 60 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరిం చాడు. మూడో స్థానంలో సౌరవ్ గంగూలీ 2000-2005 మధ్య 49 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయతే విజయాల సంఖ్య లో మాత్రం విరాట్ అందరికంటే ముందున్నాడు. కోహ్లీ సార థ్యంలో టీమిండియా 29 టెస్టుల్లో విజయం సాధించగా, ధోనీ (27), గంగూలీ (21) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
స్కోర్ బోర్డు..
భారత్ మొదటి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సీ) డుప్లెసిస్ (బీ) రబద 108, రోహిత్ శర్మ (సీ) డికాక్ (బీ) రబద 14, చటేశ్వర్ పుజారా (సీ) డుప్లెసిస్ (బీ) రబద 58, విరాట్ కోహ్లీ (బ్యాటింగ్) 63, అజింక్యా రహానే (బ్యాటింగ్) 18.
ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 273 (85.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి)
వికెట్ల పతనం: 1-25, 2-163, 3-198
బౌలింగ్: వెర్నర్ ఫిలాండర్ 17-5-37-0, కగిసో రబద 18.1-2-48-3, అన్రిచ్ నోర్జె 13-3-60-0, కేశవ్ మహారాజ్ 29-8-89-0, సినారన్ ముత్తుస్వామి 6-1-22-0, డీన్ ఎల్గర్ 2-0-11-0.
*చిత్రాలు.. మయాంక్ అగర్వాల్ (108)
*విరాట్ కోహ్లీ (63, నాటౌట్)
*చటేశ్వర్ పుజారా (58)