క్రీడాభూమి

మైదానంలోకి అభిమాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వద్దకు వెళ్లి అతడి కాళ్లను ముద్దాడాడు. ఈ క్రమంలో వెనక్కి జరిగిన హిట్‌మ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పి అభిమానిపై పడ్డాడు. వెంటనే పక్కనే ఉన్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానే రోహిత్ శర్మతో కలిసి నవ్వుతూనే అభిమానిని మైదానం వదలి వెళ్లమని వారించారు. అయినా వినకపోవడంతో గ్రౌండ్ సిబ్బంది పరుగెత్తుకొచ్చి ఆ అభిమానిని దూరంగా తీసుకెళ్లారు. అయితే దీనిపై కామేంటేటర్‌గా వ్యవహరించిన సునీల్ గవాస్కర్ సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ‘మైదానంలో పహారాకు వచ్చారా? మ్యాచ్ దగ్గరి నుంచి చూసేందుకు వచ్చారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.’ విశాఖలోనూ ఓ అభిమాని ఇలాగే దూసుకొచ్చిన విషయం తెలిసిందే.