క్రీడాభూమి

కోహ్లీ సేనకు భారీ ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు 376 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 36/3తో శనివారం మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (64)తో పాటు కేశవ్ మహారాజ్ (72) అర్ధ సెంచరీ సాధించగా, క్వింటన్ డికాక్ (31), వెర్నర్ ఫిలాండర్ (44, నాటౌట్) రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్లలో థీనస్ డీబ్రైన్ (30), అన్రిచ్ నార్జె (3), సినారన్ ముత్తుస్వామి (7), కగిసో రబద (2) విఫలమవ్వడంతో 105.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఆలౌట్ కావడంతో మూడో రోజు ఆట ముగిసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4, ఉమేశ్ యాదవ్ 3, మహ్మద్ షమీ 2, రవీంద్ర జడేజా 1 వికెట్ తీసుకున్నా రు. ఇదిలాఉంటే మ్యాచ్‌కు మరో రెండు రోజులు సమయం ఉండడంతో ఫలితం తేలే అవకాశముంది.
అశ్విన్ బ 50..
ఈ టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించా డు. దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు తీసిన నాలుగో భారత్ బౌలర్‌గా రికార్డు సాధించాడు. అశ్విన్ కంటే ముందు మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే (84), జవగాళ్ శ్రీనాథ్ (64), హర్భజన్ సింగ్ (60) ఉన్నారు.
స్కోర్ బోర్డు..
భారత్ మొదటి ఇన్నింగ్స్: 601/5 డిక్లేర్డ్ (156.3 ఓవర్లలో)
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: డీన్ ఎల్గర్ (బీ) ఉమేశ్ 6, అయడెన్ మార్కరమ్ (ఎల్బీడబ్ల్యూ) (బీ) ఉమేశ్ 0, థీనస్ డీబ్రైన్ (సీ) సాహా (బీ) ఉమేశ్ 30, టెంబ బవుమా (సీ) సాహా (బీ) షమీ 8, అన్రిచ్ నార్జె (సీ) కోహ్లీ (బీ) షమీ 3, ఫఫ్ డుప్లెసిస్ (సీ) రహానే (బీ) అశ్విన్ 64, క్వింటన్ డికాక్ (బీ) అశ్విన్ 31, సినారన్ ముత్తుస్వామి (ఎల్బీడబ్ల్యూ) (బీ) రవీంద్ర జడేజా 7, వెర్నర్ ఫిలాండర్ (నాటౌట్) 44, కేశవ్ మహారాజ్ (సీ) రోహిత్ (బీ) అశ్విన్ 72, కగిసో రబద (ఎల్బీడబ్ల్యూ) (బీ) అశ్విన్ 2.
ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 275 (105.4 ఓవర్లలో ఆలౌట్)
బౌలింగ్: ఇషాంత్ శర్మ 10-1-36-0, ఉమేశ్‌యాదవ్ 13-2-37-3, రవీంద్ర జడేజా 36-15-81-1, మహ్మద్ షమీ 17-3-44-2, రవిచంద్రన్ అశ్విన్ 28.4-9-69-4, రోహిత్ శర్మ 1-1-0-0.
*చిత్రం...దక్షిణాఫ్రికా జట్టు ఆలౌట్ కావడంతో టీమిండియా ఆటగాళ్ల ఆనందం