క్రీడాభూమి

ఈ స్టేడియాలు ఉచితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: గతంలో మరే ప్రభుత్వం చేయని రీతిలో కేంద్ర సర్కారు అసాధారణ నిర్ణయాన్ని తీసుకుంది. ఏకంగా నాలుగు స్టేడియాలను ఉచితంగా వాడుకునేందుకు అథ్లెట్లకు, వివిధ క్రీడా సమాఖ్యలకు అనుమతిచ్చింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగు స్టేడియాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ ఫిట్ ఇండియా’ను ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్, ఇందిరిగా గాంధీ స్టేడియం, మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియాల్లోని అన్ని వసతులను అథ్లెట్లు, సమాఖ్యలు ఉచితంగానే వినియోగించుకోవచ్చని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో క్రీడా సంస్కృతిని మరింత పెంచడంతోపాటు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈ చర్య ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వీటిలో ఒక్కో స్టేడియానికి ఒక్కో ప్రత్యేకత ఉందని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో, ఫుట్‌బాల్ లీగ్స్‌ను సమాఖ్యలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ఇందిరా గాంధీ స్టేడియం రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, బాడ్మింటన్ పోటీలకు అనువుగా ఉంటుందన్నారు. కర్నీసింగ్ షూటింగ్ రేంజ్‌లో షూటింగ్ పోటీలు, ధ్యాన్‌చంద్ స్టేడియంలో హాకీ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాలను అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలు వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న వసతులను ఉఫయోగించి, క్రీడల్లో ముందంజ వేయాలని అథ్లెట్లకు, సమాఖ్యలకు పిలుపునిచ్చారు. ఫిట్ ఇండియా కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నదని చెప్పారు. ఒలింపిక్స్‌లో పతకాల కోసం టాప్ పేరుతో ఇప్పటికే పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.