క్రీడాభూమి

ఆసీస్ టూర్‌కు జడేజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఆస్ట్రేలియాకు వెళ్లే భారత జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం దాదాపుగా ఖాయమైందని సమాచారం. గాయాల కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరమైన మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ కూడా రేసులో ఉన్నారు. సందీప్ పాటిల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం ఇక్కడ సమావేశమై, ఆసీస్ టూర్‌కు టీమిండియాను ఎంపిక చేస్తుంది. తమళనాడు తరఫున టి-20 మ్యాచ్‌ల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే మురళీ విజయ్‌కు సెలక్టర్లు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. టెస్టులకు మాత్రమే పరిమితమని ముద్ర వేయించుకున్న అతనికి పరిమిత ఓవర్ల సిరీస్‌లో అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తిని రేపుతున్నది. జడేజా చాలాకాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించి, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడాడు. 27 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్ మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు. అంతేగాక, 109 పరుగులు చేసి, భారత జట్టు సిరీస్‌ను అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. వనే్డ, టి-20 ఫార్మెట్స్‌కు ఎంపిక చేసే జట్లలో భారీ మార్పులు ఉండకపోవచ్చని విశే్లషకుల అభిప్రాయం. మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా కొనసాగించడంలో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా జట్టులో ఆల్‌రౌండర్ల అవసరం ఉంటుంది కాబట్టి, జడేజాను ఎంపిక చేయడం కూడా ఖాయంగా కనిపిస్తున్నది.
అందరూ ఫిట్
ఆస్ట్రేలియా టూర్‌లో పాల్గొనే టీమిండియాలో స్థానం కోసం పోటీపడుతున్న వారిలో ఎవరికీ ఫిట్నెస్ సమస్యలు లేకపోవడం విశేషం. గాయం పూర్తిగా నయం కాలేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించినప్పటికీ, ఆ వార్త తప్పు అని ఇశాంత్ శర్మ నిరూపించాడు. రంజీల్లో చక్కటి ప్రతిభ కనబరిచాడు. టెస్టుల్లో స్ట్రయిక్ బౌలర్‌గా పేరుతెచ్చుకున్న అతను పరిమిత ఓవర్ల విభాగంలో మ్యాచ్ ఆడి సుమారు ఏడాది పూర్తికావస్తున్నది. అతని పట్ల సెలక్టర్లు సానుకూలంగా స్పందిస్తారో లేదో చూడాలి. దక్షిణాఫ్రికాతో జరిగిన వనే్డ సిరీస్‌కు ఇశాంత్ ఎంపికైనప్పటికీ, రంజీ మ్యాచ్‌లో ఆడుతూ కండరాలు బెణకడంతో గాయపడ్డాడు. అతనికి పూర్తి ఫిట్నెస్ లేదంటూ సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అయితే, తాను ఫిట్నెస్‌తోనే ఉన్నానని అప్పట్లో ఇశాంత్ ప్రకటించాడు. అప్పటి వివాదం కూడా సెలక్టర్ల నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఈ అంశమే ఇశాంత్‌ను కూడా భయపెడుతున్నది.
షమీ ఫామ్‌పై అనుమానాలు!
వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ తర్వాత మోకాలికి శస్తచ్రికిత్స చేయించుకున్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి చాలాకాలం విశ్రాంతి అవసరమైంది. ఇప్పుడు జరుగుతున్న విజయ్ హజారే టోర్నీతో అతను మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఉత్తర ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌల్ చేసి, 52 పరుగులిచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్‌తో 8 ఓవర్లలో 40 పరుగులకు ఒక వికెట్ సాధించాడు. అతని ఫిట్నెస్‌పైనేగాక, ఫామ్‌పైన కూడా సెలక్టర్లకు అనుమానాలు ఉన్నాయి. కొన్ని దేశవాళీ మ్యాచ్‌లు ఆడితే అతను మళ్లీ ఫామ్‌లోకి రావచ్చుగానీ, ఫిట్నెస్ లేకపోతే సెలక్టర్లు ఏమీ చేయలేరన్న వాదన కూడా వినిపిస్తున్నది.
విజయ్‌కే ఓటు!
అంబటి రాయుడు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న కారణంగా మురళీ విజయ్‌కే సెలక్టర్లు ఓటు వేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సుమారు ఏడాది కాలంగా రాయుడు విఫలమవుతుండగా, టెస్టు క్రికెటర్‌గా తనపై ఉన్న ముద్రను తుడిపివేసుకునే ప్రయత్నంలో విజయ్ సఫలమవుతున్నాడు. ఆసీస్ అతనికి అవకాశం దక్కవచ్చు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆజింక్య రహానే, సురేష్ రైనాతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండవచ్చు. ఒకవేళ
16 మంది సభ్యులను ఎంపిక చేస్తే, అదనపు బ్యాట్స్‌మన్‌గా గుర్‌కీరత్ సింగ్ మాన్‌కు పిలుపురావచ్చు.

ఐదు వనే్డలు..
మూడు టి-20 మ్యాచ్‌లు
ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా టీమిండియా ఐదు వనే్డ ఇంటర్నేషనల్స్, మూడు టి-20 మ్యాచ్‌లు ఆడుతుంది. జనవరి 12న తొలి వనే్డతో మొదలయ్యే టూర్ 31న మూడో టి-20 మ్యాచ్‌తో ముగుస్తుంది.
మ్యాచ్‌ల వివరాలు..
జనవరి 12: మొదటి వనే్డ (పెర్త్), జనవరి 15: రెండో వనే్డ (బ్రిస్బేన్), జనవరి 17: మూడో వనే్డ (మెల్బోర్న్), జనవరి 20: నాలుగో వనే్డ (కాన్‌మెరా), జనవరి 23: ఐదో వనే్డ (సిడ్నీ), జనవరి 26: మొదటి టి-20 (అడెలైడ్), జనవరి 29: రెండో టి-20 (మెల్బోర్న్), జనవరి 31: మూడో టి-20 (సిడ్నీ).