క్రీడాభూమి

భారత్ ఇన్నింగ్స్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనితో 19 నుంచి రాంచీలో ప్రారంభం కానున్న చివరి, మూడో టెస్టు టీమిండియాకు నామమాత్రంగా మిగలగా, కనీసం ఒక విజయంతో పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితిలో దక్షిణాఫ్రికా చిక్కుకుంది. రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన విషయం తెలిసిందే. భారత్ భారీ స్కోరుకు సరైన సమాధానం చెప్పలేకపోయిన దక్షిణాఫ్రికా మ్యాచ్ మూడో రోజు తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే ఆలౌటైంది. నాలుగో రోజు ఫాలోఆన్ ఆడాల్సిందిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆహ్వానించడంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 67.2 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డీన్ ఎల్గార్ 48, తంబా బవుమా 38 పరుగులతో జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, టాప్, మిడిల్ ఆర్డర్‌లో మిగతా వారంతా దారుణంగా విఫలం కావడంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పలేదు. చివరిలో వెర్నన్ ఫిలాండర్ (37), కేశవ్ మహారాజ్ (22) కొద్దిసేపు భారత బౌలింగ్‌కు ఎదురునిలిచినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇన్నింగ్స్ తేడాతో మ్యాచ్‌ని భారత్‌కు సమర్పించుకున్న దక్షిణాఫ్రికా, సిరీస్‌ను కూడా కోల్పోయింది. భారత బౌలర్లు ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా చెరి మూడు వికెట్లు పడగొట్టి, దక్షిణాఫ్రికాను దారుణంగా దెబ్బతీశారు. రవిచంద్రన్ అశ్విన్‌కు రెండు వికెట్లు లభించాయి. ఇశాంత్ శర్మ, మహమ్మద్ షమీ చెరొక వికెట్ కూల్చారు. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్, చివరి వరకూ అదే దూకుడును కొనసాగించింది. వరుసగా 11వ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని, రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించింది.
తేలిగ్గా తీసుకోం: కోహ్లీ
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇప్పటికే కైవ సం చేసుకున్న నేపథ్యంలో, చివరిదైన మూడో టె స్టును తెలిగ్గా తీసుకుంటామని అనుకోరాదని భా రత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రి కాను 3-0 తేడాతో ఓడించి, క్లీన్ స్వీప్ చేయడమే తమ లక్ష్యమని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత మాట్లాడుతూ కోహ్లీ చెప్పా డు. తానుగానీ, జట్టులోని మిగతా సభ్యులుగానీ ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేయడం లేద ని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 156.3 ఓవర్లలో 5 వికెట్లకు 601 డిక్లేర్డ్ (మాయాంక్ అగర్వాల్ 108, చటేశ్వర్ పుజారా 58, విరాట్ కోహ్లీ 254 నాటౌట్, అజింక్య రహానే 59, రవీంద్ర జడేజా 91, కాగిసో రబదా 3/93).
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 105.4 ఓవర్లలో ఆలౌట్ 275 (తియోనిస్ బ్రూయిన్ 30, ఫఫ్ డు ప్లెసిస్ 64, క్వింటన్ డి కాక్ 31, వెర్నన్ ఫిలాండర్ 44 నాటౌట్, కేశవ్ మహారాజ్ 72, ఉమేష్ యాదవ్ 3/37, మహమ్మద్ షమీ 2/44, రవిచంద్రన్ అశ్విన్ 4/69).
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (్ఫలోఆన్): 67.2 ఓవర్లలో ఆలౌట్ 189 (డీన్ ఎల్గార్ 48, తంబా బవూమా 38, వెర్నన్ ఫిలాండర్ 37, కేశవ్ మహారాజ్ 22, ఉమేష్ యాదవ్ 3/22, రవీంద్ర జడేజా 3/52, రవిచంద్రన్ అశ్విన్ 2/45, ఇశాంత్ శర్మ 1/17, మహమ్మద్ షమీ 1/34).
*చిత్రం...దక్షిణాఫ్రికాతో పుణేలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించిన భారత క్రికెటర్ల ఆనందం